హత్యా రాజకీయాలకు నేను వ‍్యతిరేకం
ఒంగోలు: హత్యా రాజకీయాలకు తాను వ్యతిరేకమని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. కరణం బలరాం తనపై ఆరోపణలు చేయడం సరికాదని ఆయన శనివారమిక్కడ అన్నారు. అందరినీ కలుపుకొని వెళ్లాలనే తాను ప్రయత్నిస్తున్నానని, కిందస్థాయిలో ఇన్ని గొడవులు ఉంటాయని తనకు తెలియదన్నారు. పార్టీపరంగా... వ్యక్తిగతంగా నష్టపోయినా, తాను హత్యా రాజకీయాలకు వ్యతిరేకమన్నారు. జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టితికి తీసుకు వెళతానని ఆయన తెలిపారు.