Vemavaram
-
తూర్పు గోదావరిలో బాణాసంచా పేలుడు కలకలం
-
క్షణికావేశంతో జీవితాలను నాశనం చేసుకోవద్దు
బల్లికురవ: క్షణికావేశంతో జీవితాలను నాశనం చేసుకోవద్దని గ్రామాల్లో ప్రజలు కక్షలు విడనాడి ప్రశాంతంగా జీవించాలని ఎస్పీ సత్య ఏసుబాబు కోరారు. మే 19న వేమవరం గ్రామంలో జరిగిన జంట హత్యల నేపథ్యంలో ఆయన గురువారం గ్రామాన్ని పరిశీలించారు. దాడులు జరిగిన ప్రాంతాలను, గ్రామ మ్యాప్‌ను పరిశీలించారు. తరువాత దాడితో గాయపడిన గోరంట్ల వెంకటేశ్వర్లు, పేరయ్య, వేగినాటి ముత్యాలరావు, వీరరాఘవుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. దాడిలో మరణించిన గోరంట్ల పెద అంజయ్య, వేగినాటి రామకోటేశ్వరరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శాంతి భద్రతల విషయంలో పోలీసు శాఖకు ప్రజలు సహకరించాలన్నారు. ప్రాణం విలువ ఎంతో ముఖ్యమైందని, ఘర్షణలతో క్షణికావేశాలకు లోనైతే, ప్రాణాలు పోవడంతోపాటు, కోర్టుల చుట్టూ తిరగడం, జైలు పాలు అవుతారని చెప్పారు. దీనివల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయని హెచ్చరించారు. ఒకప్పుడు పల్లెల్లో ఎంతో ప్రశాతం వాతావరణం ఉండేదన్నారు. నేడు ఆ పరిస్థితి లేదన్నారు. గ్రామాల్లో ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరారు. దర్శి డీఎస్పీ శ్రీరాంబాబు, అద్దంకి సీఐ హైమారావు, ఎస్సై కట్టా అనూక్ పాల్గొన్నారు. డీటీసీ పరిశీలన ఒంగోలు క్రైం: స్థానిక డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ (డీటీసీ–పోలీస్)ని ఎస్పీ బి. సత్య ఏసుబాబు గురువారం పరిశీలించారు. నూతనంగా ఎంపికైన స్టైఫండరీ కానిస్టేబుళ్లకు జూలై నెల 14 నుంచి ఇక్కడ శిక్షణ ఇవ్వనుండటంతో సౌకర్యాల గురించి డీటీసీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 250 మంది స్టైఫండరీ కానిస్టేబుళ్లు శిక్షణ పొందనున్నారు. సంబంధిత ఏర్పాట్లపై వైస్ ప్రిన్సిపాల్ వై.శ్రీనివాసరెడ్డితో సమీక్షించారు. నైతిక విలువలతో కూడిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఎస్బీ డీఎస్పీ ఉప్పుటూరి నాగరాజు తదితర పోలీస్ అధికారులున్నారు. కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ ఒంగోలు టౌన్: కలెక్టర్ వి. వినయ్‌చంద్‌ను స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎస్పీ భూసారపు సత్యఏసుబాబు గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా కలెక్టర్‌తో భేటీ అయ్యి జిల్లాలో శాంతిభద్రతల గురించి చర్చించారు. -
హత్యా రాజకీయాలకు నేను వ్యతిరేకం
-
హత్యా రాజకీయాలకు నేను వ్యతిరేకం
ఒంగోలు: హత్యా రాజకీయాలకు తాను వ్యతిరేకమని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. కరణం బలరాం తనపై ఆరోపణలు చేయడం సరికాదని ఆయన శనివారమిక్కడ అన్నారు. అందరినీ కలుపుకొని వెళ్లాలనే తాను ప్రయత్నిస్తున్నానని, కిందస్థాయిలో ఇన్ని గొడవులు ఉంటాయని తనకు తెలియదన్నారు. పార్టీపరంగా... వ్యక్తిగతంగా నష్టపోయినా, తాను హత్యా రాజకీయాలకు వ్యతిరేకమన్నారు. జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టితికి తీసుకు వెళతానని ఆయన తెలిపారు. -
రవికుమార్‌కు దమ్ముంటే మాతో తలపడాలి
గుంటూరు : టీడీపీలోకి కొత్తగా వచ్చినవారి వల్లే గొడవలు జరుగుతున్నాయని కరణం బలరాం కుమారుడు వెంకటేష్ అన్నారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గీయుల దాడిలో గాయపడి, చిలకలూరిపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా కరణం వెంకటేష్ మాట్లాడుతూ.. గొట్టిపాటి రవికుమార్ ఆగడాలు పెరిగిపోయాయని అన్నారు. విచక్షణారహితంగా అమాయకులను వెంటాడి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే గొట్టిపాటి రవికుమార్ తమతో తలపడాలని, అంతేకానీ టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. తన స్వలాభం కోసమే రవికుమార్ అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అందుకు అడ్డొచ్చినవారిని చంపేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రికి మాట రాకూడదనే తాము ఓపిక పట్టామని అన్నారు. ఇప్పటికైనా గొట్టిపాటి రవికుమార్ అందర్ని కలుపుకుపోవాలని సూచించారు. స్వలాభం కోసమే గొట్టిపాటి టీడీపీలో చేరారన్నారు. చనిపోయినవారంతా 30 ఏళ్లుగా పార్టీ జెండాలు మోసారని కరణం వెంకటేశ్ తెలిపారు. కేవలం రవి వల్లే అద్దంకిలో అల్లర్లు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఆలోచన చేయాలని అన్నారు. టీడీపీ కార్యకర్తలకు న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమన్నారు. కాగా ఎమ్మెల్సీ కరణం బలరాం, ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య వ్యక్తిగత కక్షలు భగ్గుమన్న విషయం తెలిసిందే. బల్లికురవ మండలం వేమవరంలో ఓ వివాహానికి వెళ్లి వస్తున్న బలరాం వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు శుక్రవారం రాత్రి కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారిలో కరణం వర్గీయులు ఇద్దరు చనిపోయారు. -
జాదూగాడురా..
పెళ్లిళ్లు చేయిస్తానని చెప్పి మోసానికి పాల్పడిన యువకుడు అరెస్టు యువతను మోసగిస్తున్న ఎంటెక్ పట్టభద్రుడు వివాహాలు చేయిస్తానని రూ.లక్షల్లో వసూలు నిందితుడి అరెస్టు, రూ.12 లక్షల సొత్తు స్వాధీనం కాకినాడ క్రైం : అతను ఇంజినీరింగ్‌లో పీజీ పూర్తిచేశాడు. పలు ఉద్యోగాలకు ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయాడు. సులువుగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారిని ఎంచుకున్నాడు. ఇంటివద్దే ఉంటూ యువత ఆదాయం సంపాదించుకోవచ్చంటూ పేపర్లలో ప్రకటనలు ఇచ్చి పలువురిని మోసగించి, చివరకు పోలీసులకు దొరికిపోయాడు. కాకినాడ రెండో పట్టణ పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. అతడి వద్ద నుంచి పోలీసులు రూ.12 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకుని సోమవారం కోర్టులో హాజరు పరిచారు. మోసగించే విధానం ఇదీ.. తొండంగి మండలం, వేమవరానికి చెందిన మారేటి శ్రీనివాసరావు (24) అలియాస్ (ఈశ్వర్, రామిరెడ్డి) హైదరాబాద్‌లో ఎంటెక్ చేశాడు. సులువుగా అడ్డదారిన డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకు పెళ్లికాని ఆశావహులు, యువతను ఎంచుకున్నాడు. వివాహ పరిణయ వేదిక మ్యారేజ్ బ్యూరోను 2014లో ఈశ్వర్ పి. వెంకటరామిరెడ్డి అనే పేరుతో ప్రారంభించాడు. భర్తలేని భార్యకు రెండో పెళ్లి అని... పీటలమీద పెళ్లి ఆగిపోయిందని ఎక్కువ మొత్తంలో కట్నం ఇస్తామని... కులమతాలతో ప్రసక్తి లేదంటూ ఇలా రకరకాల ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చి, అందమైన యువతుల ఫొటోలను చూపించి యువకులను ఆకర్షించేవాడు. శ్రీనివాసరావు మాయలో పడిన యువకుల నుంచి ప్రాసెసింగ్ ఖర్చుల కోసమంటూ రూ.10 వేల వరకూ వసూలు చేసేవాడు. టెలికాలర్ ఉద్యోగం పేరిట నెలకు రూ.12 వేల వరకూ ఆదాయం గడించవచ్చంటూ ప్రకటన లిచ్చి నిరుద్యోగ యువత నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. బాధితుల నుంచి ఆధార్, ఏటీఎం కార్డులతో పాటు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకునేవాడు. ఇలా తీసుకున్న ప్రూఫ్స్‌తో వారి పేరుతో íసిమ్ కార్డులు తీసుకునేవాడు. వివాహాల కోసం, టెలికాలర్ ఉద్యోగం కోసం కట్టిన డబ్బులను తన ఖాతాలో డిపాజిట్ చేసుకోకుండా తన సంస్థలో టెలి కాలర్ ఉద్యోగం చేస్తున్న కొంతమంది ఖాతాల్లో వారికి తెలియకుండా డిపాజిట్ చేయించేవాడు. ఏటీఎం కార్డులతో వారికి తెలియకుండానే డబ్బులు డ్రా చేసేవాడు. ఒక్కో యువకుడితో ఒక నకిలీ సిమ్ కార్డుతో సంభాషణ సాగించి, పనిపూర్తయ్యాక ఆ సిమ్ తొలగించేవాడు. ఇలా ఇతను గుంటూరు నుంచి కృష్ణా, విజయవాడ, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాల నుంచే కాక తమిళనాడులోని కొంతమంది బాధితులను మోసగించినట్టు పోలీసుల తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కాకినాడ రెండో పట్టణ పోలీసులు నిందితుడ్ని పట్టుకునేందుకు అనేక మార్గాల్లో అన్వేషించారు. బ్యాంకు ఖాతాల లావాదేవీలు, సీసీ పుటేజీ వివరాలు, డబ్బు చెల్లించిన ఖాతాలను పరిశీలించగా పోలీసులు ఆధారాలు దొరికాయి. ఎట్టకేలకు కాకినాడ జగన్నాథపురం ఆంధ్రా బ్యాంకులో ఓ మహిళ ఖాతాకు రూ.4.50 లక్షల డిపాజిట్ అయినట్టు గుర్తించి, విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడిందని డీఎస్పీ వెంకటేశ్వరరావు వివరించారు. నిందితుడ్ని అతడి స్వగ్రామం వేమవరంలో పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి ఎస్టీమ్ కారు, స్కూటర్, 9 బంగారు ఉంగరాలు, 2 బంగారు చైన్లు, 50 నకిలీ సిమ్‌కార్డులు, 10 సెల్ఫోన్లు, 15 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. సమావేశంలో సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై వంశీధర్ పాల్గొన్నారు. -
విద్యార్థినికి వేధింపులు
పిట్టల వేమవరం (పెరవలి): తనను ఇద్దరు విద్యార్థులు వేధిస్తున్నారంటూ ఒక విద్యార్థిని పాఠశాలలో చేయి కోసుకోగా ఆ విషయమై చర్యలు తీసుకోవలసిన ఉపాధ్యాయులు వర్గాలుగా విడిపోయి దూషించుకోవడం, అసలు విషయాన్ని పక్కకు నెట్టి వీరి వాదించుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి లోనై పిల్లలను పాఠశాల నుంచి తీసుకుపోవడం వంటి ఘటనలతో పెరవలి మండలం పిట్టల వేమవరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వివరాలిలా ఉన్నాయి. పెరవలి మండలం పిట్టల వేమవ రం ఉన్నత పాఠశాలలో మూడురోజులుగా జరుగుతున్న సంఘటనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న ఒక బాలికను తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ప్రేమించలేదంటే నీ అంతు చూస్తాం, తరగతి గదిలోకి వెళ్లనివ్వం అంటూ శనివారం వేధించారు. ఆ విద్యార్థిని ఎవరికీ చెప్పుకోలేక, చనిపోదామనే ఉద్దేశంతో చేతులను కోసుకుంది. ఇది చూచిన విద్యార్థిని స్నేహితురాళ్లు ఉపాధ్యాయులకు చెప్పారు. దీనిపై ప్రధానోపాధ్యాయురాలు చెరుకూరి పద్మ శనివారం పెరవలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సమస్యకు కారణమైన విద్యార్థులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. విద్యార్థుల తల్లిదండ్రులు సర్దుబాటు చేసుకుంటామని తమ పిల్లలను ఇళ్లకు తీసుకువచ్చారు. సోమవారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామపెద్దలు, ఉపాధ్యాయులు, ఎంఈవో, పోలీసుల సమక్షంలో బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సమస్యకు కారణమైన ఉపాధ్యాయులను బదిలీ చేయాలని లేకపోతే మా పిల్లలను తీసుకుపోతామని కొందరు తల్లిదండ్రులు చెప్పారు. పోలీసు సమక్షంలోనే 11 మంది ఉపాధ్యాయులలో తొమ్మిది మంది పిల్లల రక్షణకు బాధ్యత వహిస్తామని రాసి ఇవ్వటానికి సిద్ధమయ్యారు. మిగిలిన ఇద్దరు డీ మనోజ్, ఆంజనేయరాజు అంగీకరించకపోవటంతో సభలో గందరగోళం ఏర్పడింది. తల్లితండ్రులు మాత్రం ఈ గొడవలకు కారణం ఈ ఇద్దరేనని వీరిని పాఠశాల నుంచి బదిలీ చేయాలని లేకపోతే మా పిల్లలను పాఠశాలకు పంపించబోమని తెలిపారు. దీనిపై ఎంఈవో నల్లా సత్యనారాయణ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వటంతో ఉపాధ్యాయులు అందరినీ ఏలూరు రమ్మని ఆదేశించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను తీసుకొని వెళ్లిపోయారు. జరిగిన విషయాలు జిల్లా విద్యాశాఖాధికారి మధుసూదనరావుకి తెలియజేయడంతో వె ంటనే తణుకు డెప్యూటీ విద్యాశాఖాధికారి జె.స్వామిరాజును పాఠశాలకు వెళ్లి సాయంత్రం 5గంటలలోపు విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించటంతో ఆయన ఘటనా స్థలానికి వచ్చారు. ఉపాధ్యాయులను, గ్రామ పెద్దలను విచారించి తిరిగి వెళ్లిపోయారు. పెరవలి ఎస్సై డి.రవికుమార్‌ను వివరణ అడగగా ఈ సంఘటన జరిగిందని తెలిసిన వెంటనే విద్యార్థులను తీసుకువచ్చామని కాని ఇక్కడ ఉపాధ్యాయులలో విభేదాలు ఉన్నాయని చెప్పారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
రుణమాఫీ అమలు చేయాలని రైతుల ధర్నా
ఎ.వేమవరం (ఆచంట): రైతు, డ్వాక్రారుణాల మాఫీలో ప్రభుత్వం తాత్సారం చేయకుండా వెంటనే రద్దు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి గెద్దాడ వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివార ం ఆచంట వేమవరం సొసైటీ వద్ద రుణాలు రద్దు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గెద్దాడ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయడంతో ప్రభుత్వం తాత్సారం చేయడం సిగ్గుచేటన్నారు. రుణాల రద్దు సకాలంలో జరగకపోవడంతో వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీచేస్తున్న ప్రభుత్వం రుణాలు ఇవ్వడంతో శ్రద్ధ చూపడంలేదని వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఈసందర్భంగా సొసైటీ కార్యదర్శి ఆరుమిల్లి వెంకటేశ్వరరాకు వినతి పత్రం అందించారు. ధర్నాలో సీపీఎం నాయకులు జక్కంశెట్టి శ్రీనివాసు, కాండ్రేకుల వెంకటేశ్వరరావు, మన్నె వెంకటేశ్వరరావు, నేతల సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.