karanam Venkatesh
-
'20 ఏళ్లలో ఎన్నో అవమానాలు'
సాక్షి, ప్రకాశం: సంవత్సరాలుగా పోరాడిన బీసీలకు దక్కని రాజ్యాధికారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమైందని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. 139 బీసీ కులాలకు సంబంధించి 56 కార్పోరేషన్లు ఏర్పాటుచేయడం, 56 మందిని చైర్మన్లుగా, 728 మందిని డైరెక్టర్లుగా ఎంపిక చేస్తూ సీఎం తీసుకున్న నిర్ణయంపై జిల్లాలోని బీసీలంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం చీరాల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేశారు. చీరాలలోని గడియార స్తంభం సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి, జ్యోతిరావు పూలే విగ్రహానికి వైఎస్సార్సీపీ నాయకులు పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. 'బీసీ మహిళగా ఉన్న తనను 20 ఏళ్లపాటు చంద్రబాబు ఎన్నో అవమానాల పాలు చేశాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు కరణం వెంకటేష్ మాట్లాడుతూ.. 'పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ఏడాదిన్నర కాలంలోనే అన్ని వర్గాలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేరువ చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది' అని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అమృతపాణి, మాజీమంత్రి పాలేటి రామారావు, బీసీ కమిషన్ మెంబర్ ముసలయ్య పాల్గొన్నారు. -
పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం
-
టీడీపీకి షాక్: వైఎస్సార్సీపీలోకి కరణం వెంకటేశ్
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పగా.. తాజాగా టీడీపీ సీనియర్ నేత, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్ వైఎస్సార్సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కరణం వెంకటేశ్‌తోపాటు మాజీ మంత్రి పాలేటి రామారావు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. (చదవండి: ‘టీడీపీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదు’) ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని వెంకటేశ్ ఈ సందర్భంగా వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ పాలనపై అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ చీరాల అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు. (చదవండి: వైఎస్సార్సీపీలోకి రామసుబ్బారెడ్డి కుటుంబం) ఇది శుభపరిణామం : మంత్రి శ్రీనివాస్‌రెడ్డి ‘కరణం వెంకటేశ్, పాలేటి రామారావు వైఎస్సార్సీపీలో చేరడం శుభపరిణామం. సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన చూసి వీరు పార్టీలో చేరారు. కరణం బలరాంకు టీడీపీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినా ఆయనను చాలా ఇబ్బంది పెట్టారు. కొత్తగా వచ్చిన వారిని తీసుకుని సీనియర్లను పక్కన పెట్టారు. చంద్రబాబు విధానాలను బలరాం వ్యతిరేకిస్తున్నారు’అని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరిన కరణం బలరాం నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. (చదవండి: బాబూ.. సైకిల్ తొక్కలేం!) -
హత్యా రాజకీయాలకు నేను వ్యతిరేకం
-
హత్యా రాజకీయాలకు నేను వ్యతిరేకం
ఒంగోలు: హత్యా రాజకీయాలకు తాను వ్యతిరేకమని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. కరణం బలరాం తనపై ఆరోపణలు చేయడం సరికాదని ఆయన శనివారమిక్కడ అన్నారు. అందరినీ కలుపుకొని వెళ్లాలనే తాను ప్రయత్నిస్తున్నానని, కిందస్థాయిలో ఇన్ని గొడవులు ఉంటాయని తనకు తెలియదన్నారు. పార్టీపరంగా... వ్యక్తిగతంగా నష్టపోయినా, తాను హత్యా రాజకీయాలకు వ్యతిరేకమన్నారు. జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టితికి తీసుకు వెళతానని ఆయన తెలిపారు. -
రవికుమార్‌కు దమ్ముంటే మాతో తలపడాలి
గుంటూరు : టీడీపీలోకి కొత్తగా వచ్చినవారి వల్లే గొడవలు జరుగుతున్నాయని కరణం బలరాం కుమారుడు వెంకటేష్ అన్నారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గీయుల దాడిలో గాయపడి, చిలకలూరిపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా కరణం వెంకటేష్ మాట్లాడుతూ.. గొట్టిపాటి రవికుమార్ ఆగడాలు పెరిగిపోయాయని అన్నారు. విచక్షణారహితంగా అమాయకులను వెంటాడి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే గొట్టిపాటి రవికుమార్ తమతో తలపడాలని, అంతేకానీ టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. తన స్వలాభం కోసమే రవికుమార్ అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అందుకు అడ్డొచ్చినవారిని చంపేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రికి మాట రాకూడదనే తాము ఓపిక పట్టామని అన్నారు. ఇప్పటికైనా గొట్టిపాటి రవికుమార్ అందర్ని కలుపుకుపోవాలని సూచించారు. స్వలాభం కోసమే గొట్టిపాటి టీడీపీలో చేరారన్నారు. చనిపోయినవారంతా 30 ఏళ్లుగా పార్టీ జెండాలు మోసారని కరణం వెంకటేశ్ తెలిపారు. కేవలం రవి వల్లే అద్దంకిలో అల్లర్లు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఆలోచన చేయాలని అన్నారు. టీడీపీ కార్యకర్తలకు న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమన్నారు. కాగా ఎమ్మెల్సీ కరణం బలరాం, ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య వ్యక్తిగత కక్షలు భగ్గుమన్న విషయం తెలిసిందే. బల్లికురవ మండలం వేమవరంలో ఓ వివాహానికి వెళ్లి వస్తున్న బలరాం వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు శుక్రవారం రాత్రి కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారిలో కరణం వర్గీయులు ఇద్దరు చనిపోయారు. -
టీడీపీ కేడర్‌లో అంతర్మథనం
సాక్షి, ఒంగోలు: పార్టీ అధికారంలోకొచ్చిన సంతోషం కన్నా జిల్లాలో సగానికి సగం సీట్లు కోల్పోయామనే బాధ తెలుగుదేశం పార్టీలో నెలకొంది. పార్టీ అధికారంలోకి రాకున్నా.. మొదటి ప్రయత్నమే సగం సీట్లు కైవసం చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ దుమ్ము దులిపింది. ఇక్కడ గెలిచిన వారికీ.. ఓడిన వారికీ ఒకే నిరాశ మిగిలింది. ఓట్ల లెక్కింపునకు కొన్ని క్షణాల ముందు వరకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధికారంలోకి వ స్తోందని కలలు కన్న నేతల ఆశలపై జిల్లా ఓటర్లు నీళ్లు చల్లారు. వైఎస్సార్ సీపీ నుంచి ఆరుగురు అభ్యర్థులు గెలుపొందగా, టీడీపీ నుంచి ఐదుగురు విజయం సాధించారు. అధికారంలోకి వచ్చేది టీడీపీ కూటమి అంటూ కౌంటింగ్‌నకు నాలుగురోజుల ముందుగానే కొన్ని చానెళ్ల సర్వేలు, ఇతర ఏజెన్సీ సర్వేసంస్థల అంచనాలతో ..జిల్లా టీడీపీ నేతలు తామంతా గెలుస్తామని భావించారు. తీరా పరిస్థితి తిరగబడటంతో వారంతా దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలదీ అదే పరిస్థితిగా చెప్పవచ్చు. అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసిన కరణం వెంకటేష్ ఓట్లలెక్కింపునకు ముందు తమ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు తాను వ్యక్తిగతంగా సర్వే చేయించుకున్నానని.. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని.. సీమాంధ్రలో టీడీపీ రూలింగ్ అంటూ చెప్పుకు న్నారు. పరిపాలనాపగ్గాలు చంద్రబాబుకు దక్కినా.. కరణం వెంకటేష్ మాత్రం ఓటమిచెందారు. తన గెలుపుతో పాటు పార్టీ అధికారంలోకొస్తుందని.. రిజర్వుడు కేటగిరీలో మంత్రిపదవి కూడా దక్కుతుందని సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థి బీఎన్ విజయ్‌కుమార్ కేడర్‌లో విస్తృత ప్రచారం చేసుకున్నారు. అయితే, టీడీపీ అధికారంలోకొచ్చినా.. ఆయన మాత్రం ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసారి తనతోపాటు సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డిని లోక్‌సభ అభ్యర్థిగా గెలిపించడం ఖాయమని పార్టీ అధిష్టానం వద్ద గట్టిగా హామీనిచ్చారు. అయితే, ఎంపీగా వైవీ సుబ్బారెడ్డి గెలిచినా.. ఈసారి బాలినేనికి చుక్కెదురైంది. మొదటి సారి గెలిచిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆనందంగా ఉండగా.. మార్కాపురం సిట్టింగ్ స్థానం కోల్పోయి కందుల నారాయణరెడ్డి, వై.పాలెం నుంచి అజితారావు ఎన్నికల్లో భారీగా డబ్బుఖర్చు పెట్టి చేతులు కాల్చుకున్నారు. టీడీపీ అధికారంలోకొస్తే.. తనకు మంత్రి పదవి గ్యారెంటీ అని ముందే చెప్పుకున్న అన్నా రాంబాబుకు గిద్దలూరు నియోజకవర్గ ఓటర్లు ఇచ్చిన ప్రతికూల తీర్పుతో కేడర్ కోలుకోలేదు. సంతనూతలపాడులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ గెలుపునకు కృషిచేసిన బాపట్ల ఎంపీ అభ్యర్థి డాక్టర్ అమృతపాణి, దర్శి అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి ఇద్దరికీ ఓటమి ఎదురైంది. ఆదిమూలపు సురేష్‌కు గెలిచాననే ఆనందం మిగిలినా.. పార్టీ అధికారం కోల్పోవడం నిరాశ మిగిల్చింది. కేడర్ సంగతి తర్వాత అంటూ... ఊహించని సార్వత్రిక ఫలితాలతో టీడీపీ, వైఎస్సార్ సీపీ కేడర్ కంగుతింది. దీంతో ఎవరికి వారు అంతర్గత సమావేశాలతో ఓట్ల పోలింగ్‌పై కసరత్తు చేస్తూ.. లోపాలపై అంతర్మథనం చెందుతున్నారు. ఈక్రమంలో కేడర్‌లో మరలా కొత్తరక్తాన్ని ఎక్కించి ప్రధాన ప్రతిపక్షంగా ఉద్యమ చైతన్యంతో ముందుకెళ్లాలనే ఆలోచనలో వైఎస్సార్ కాంగ్రెస్ ఉంది. టీడీపీ మాత్రం ఇందుకు భిన్నంగా నడుస్తోంది. డీలాపడ్డ కేడర్ సంగతి తర్వాత చూస్తామంటూ.. ముందు జిల్లాలో ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయా..? అనే కసరత్తులో ఉంది. టీడీపీ తరఫున పోటీచేసి గెలిచిన ఎమ్మెల్యేల్లో జిల్లా నుంచి పలువురు చంద్రబాబు కేబినెట్లో అవకాశం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వీరిలో దర్శి ఎమ్మెల్యే శిద్దా రాఘవరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఉన్నారు. సామాజికవర్గ సమీకరణల్లో కేబినెట్లో తనకు గానీ అవకాశం దక్కకుంటే, తన తరఫున కొండపి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన డోలా బాలవీరాంజనేయస్వామికి మంత్రిపదవి ఇవ్వాలని దామచర్ల పావులు కదుపుతున్నారు. కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావుకు ప్రస్తుతం హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ ఆశీస్సులు మెండుగా ఉన్నందున .. అతనూ అమాత్య రేసులో ముందున్నట్టు తెలిసింది.