
వీఆర్వో, వీఆర్ఏ దరఖాస్తు రుసుం తగ్గింపు: రఘువీరా
వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగాలకు దరఖాస్తు రుసుం తగ్గించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి వెల్లడించారు.
వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగాలకు దరఖాస్తు రుసుం తగ్గించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడుతూ... ఓసీ, బీసీలకు రుసుం రూ. 500 నుంచి రూ. 300కు తగ్గించినట్లు తెలిపారు.
అలాగే ఎస్సీ, ఎస్టీలకు కూడా దరఖాస్తు రుసుం రూ. 300 నుంచి 150 కు తగ్గించినట్లు చెప్పారు. ఏడో విడత భూపంపిణి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు రఘువీరారెడ్డి వివరించారు.