vro and vra posts
-
వీఆర్ఏ, వీఆర్ఓ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, కాకినాడ : వీఆర్ఏ, వీఆర్ఓ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్టు జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర భూ పరిపాలనా విభాగం ముఖ్య కమిషనర్ ఐవైఆర్ కృష్ణారావు హైదరాబాద్ నుంచి జాయింట్ కలెక్టర్లతో శుక్రవారం రాత్రి నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్సలో ఆయన పాల్గొన్నారు. రెండు పరీక్షలూ రాసే అభ్యర్థుల్లో 19 మందికి రెండు పరీక్షా కేంద్రాలూ వేర్వేరు ప్రాంతాల్లో వచ్చాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని వారికి కాకినాడ మెక్లారిన్ స్కూల్లో పరీక్షా కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని చెప్పారు. హాల్ టికెట్లలో ఫొటోలు లేకపోయినా, లింగభేదంతో ఫొటోలు ఉన్నా గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన మూడు పాస్పోర్ట సైజ్ ఫొటోలతో రావాలన్నారు. జవాబు పత్రాలను బ్లూ లేదా బ్లాక్ పాయింట్ బాల్‌పెన్‌తో మాత్రమే బబ్లింగ్ చేయాలన్నారు. వైట్నర్, బ్లేడు లేదా ఎరేజర్‌తో దిద్దుబాట్లకు పాల్పడితే వాల్యుయేషన్ కావన్నారు. అలా దిద్దిన జవాబు పత్రాలుంటే ఇన్విజిలేటర్లు వేరే బండిల్‌గా కట్టాలని సూచించారు. అభ్యర్ధుల వేలిముద్రలు తప్పనిసరిగా తీసుకోవాలని, వీడియో తీయించాలని అధికార్లకు చెప్పారు. ఇదిలా ఉండగా ఈ పరీక్షల నిర్వహణపై జేసీ ముత్యాలరాజు సారథ్యంలో చీఫ్ సూపరింటెండెంట్లకు, అసిస్టెంట్ చీఫ్ ఎగ్జామినర్లకు శుక్రవారం శిక్షణ జరిగింది. పరీక్షల నిర్వహణకు 2010 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 74,483 మంది పరీక్షకు హాజరుకానున్నారన్నారు. కాకినాడలో 15 సెంటర్లు ఏర్పాటు చేయగా 9,429 మంది రాస్తారన్నారు. హాల్ టిక్కెట్లు సక్రమంగా ఉంటేనే లోనికి పంపాలని సూచించారు -
వీఆర్వో, వీఆర్ఏ దరఖాస్తు రుసుం తగ్గింపు: రఘువీరా
వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగాలకు దరఖాస్తు రుసుం తగ్గించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ... ఓసీ, బీసీలకు రుసుం రూ. 500 నుంచి రూ. 300కు తగ్గించినట్లు తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు కూడా దరఖాస్తు రుసుం రూ. 300 నుంచి 150 కు తగ్గించినట్లు చెప్పారు. ఏడో విడత భూపంపిణి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు రఘువీరారెడ్డి వివరించారు. -
రెవెన్యూ పోస్టుల భర్తీకి చర్యలు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీకి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోస్టుల భర్తీకి సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. జిల్లాలో వీఆర్వో పోస్టులు 105, వీఆర్ఏ పోస్టులు 176 భర్తీ చేస్తున్నామని తెలిపారు. మండలాల నుంచి కేటగిరీ వారీగా రోస్టర్ పాయింట్ ప్రకారం ఖాళీల వివరాలు సేకరించామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 28న నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు రూ. 200, ఇతరులు రూ.500ను పరీక్ష ఫీజు కింద మీ-సేవ కేంద్రాల్లో చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నారు. వికలాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉందని, ఇందుకు సదరం ధృవీకరణ పత్రం ఉండాలని తెలిపారు. రెండు కేటగిరీల పోస్టులకు పోటీ పడేవారు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వీఆర్వో పోస్టులు జిల్లా యూనిట్‌గా భర్తీ చేస్తామన్నారు. వీఆర్ఏ పోస్టులకు ఆయా రెవెన్యూ గ్రామాలకు చెందిన వారే అర్హులన్నారు. వీఆర్వో పోస్టులకు ఇంటర్, వీఆర్ఏ పోస్టులకు 10వ తరగతి కనీస అర్హతగా ఉందన్నారు. 4వ తరగతి నుంచి వరుసగా నాలుగేళ్లు ఏ జిల్లాలో చదివి ఉంటారో అదే వారి స్థానిక జిల్లాగా పరిగణిస్తామన్నారు. 2013 జూలై 1వతేదీ నాటికి 18 ఏళ్లు నుంచి 36, వీఆర్ఏ పోస్టులకు 18 నుంచి 37 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, వికలాంగులకు గరిష్ట వయోపరిమితిలో మినహాయింపు ఉంటుందన్నారు. నోటిఫికేషన్ విడుదల, సెంటర్ల గుర్తింపు, ఇతర చర్యలపై దృష్టి పెట్టినట్లు ఆయన వివరించారు. -
28న వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు నోటిఫికేషన్
-
28న వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు నోటిఫికేషన్
త్వరలో భారీగా ప్రభుత్వోద్యోగాలు రానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 4,305 వీఆర్ఏ, 1,657 వీఆర్వో ఉద్యోగాల భర్తీకి ఈనెల 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. జనవరి 12వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 2న పరీక్ష నిర్వహించి, 20వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. వివిధ జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి... శ్రీకాకుళం జిల్లా: వీఆర్వో-77, వీఆర్ఏ-176; విజయనగరం జిల్లా: వీఆర్వో-90, వీఆర్ఏ-137; విశాఖపట్నం జిల్లా: వీఆర్వో-41, వీఆర్ఏ-12; తూర్పు గోదావరి జిల్లా: వీఆర్వో-87, వీఆర్ఏ-357; పశ్చిమ గోదావరి జిల్లా: వీఆర్వో-51, వీఆర్ఏ-360; కృష్ణా జిల్లా: వీఆర్వో-64, వీఆర్ఏ-403, గుంటూరు జిల్లా: వీఆర్వో-84, వీఆర్ఏ-425; ప్రకాశం జిల్లా: వీఆర్వో-118, వీఆర్ఏ-282; నెల్లూరు జిల్లా: వీఆర్వో-48, వీఆర్ఏ-145 చిత్తూరు జిల్లా: వీఆర్వో-104, వీఆర్ఏ-188; అనంతపురం జిల్లా: వీఆర్వో-64, వీఆర్ఏ-167; వైఎస్ఆర్ జిల్లా: వీఆర్వో-27, వీఆర్ఏ-128; కర్నూలు జిల్లా: వీఆర్వో-105, వీఆర్ఏ-176 మహబూబ్‌నగర్ జిల్లా: వీఆర్వో-103, వీఆర్ఏ-94; కరీంనగర్ జిల్లా: వీఆర్వో-83, వీఆర్ఏ-223; మెదక్ జిల్లా: వీఆర్వో-98, వీఆర్ఏ-172; వరంగల్ జిల్లా: వీఆర్వో-62, వీఆర్ఏ-177; నిజామాబాద్ జిల్లా: వీఆర్వో-65, వీఆర్ఏ-94; ఆదిలాబాద్ జిల్లా: వీఆర్వో-52, వీఆర్ఏ-83; ఖమ్మం జిల్లా: వీఆర్వో-78, వీఆర్ఏ-105; నల్గొండ జిల్లా: వీఆర్వో-68, వీఆర్ఏ-201; రంగారెడ్డి జిల్లా: వీఆర్వో-72, వీఆర్ఏ-158 హైదరాబాద్ వీఆర్వో-17, వీఆర్ఏ-42