సాక్షి, కాకినాడ :
వీఆర్‌ఏ, వీఆర్‌ఓ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్టు జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర భూ పరిపాలనా విభాగం ముఖ్య కమిషనర్ ఐవైఆర్ కృష్ణారావు హైదరాబాద్ నుంచి జాయింట్ కలెక్టర్లతో శుక్రవారం రాత్రి నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్‌సలో ఆయన పాల్గొన్నారు. రెండు పరీక్షలూ రాసే అభ్యర్థుల్లో 19 మందికి రెండు పరీక్షా కేంద్రాలూ వేర్వేరు ప్రాంతాల్లో వచ్చాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని వారికి కాకినాడ మెక్లారిన్ స్కూల్లో పరీక్షా కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని చెప్పారు. హాల్ టికెట్లలో ఫొటోలు లేకపోయినా, లింగభేదంతో ఫొటోలు ఉన్నా గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన మూడు పాస్‌పోర్‌ట సైజ్ ఫొటోలతో రావాలన్నారు. జవాబు పత్రాలను బ్లూ లేదా బ్లాక్ పాయింట్ బాల్‌పెన్‌తో మాత్రమే బబ్లింగ్ చేయాలన్నారు.
వైట్‌నర్, బ్లేడు లేదా ఎరేజర్‌తో దిద్దుబాట్లకు పాల్పడితే వాల్యుయేషన్ కావన్నారు. అలా దిద్దిన జవాబు పత్రాలుంటే ఇన్విజిలేటర్లు వేరే బండిల్‌గా కట్టాలని సూచించారు. అభ్యర్ధుల వేలిముద్రలు తప్పనిసరిగా తీసుకోవాలని, వీడియో తీయించాలని అధికార్లకు చెప్పారు. ఇదిలా ఉండగా ఈ పరీక్షల నిర్వహణపై జేసీ ముత్యాలరాజు సారథ్యంలో చీఫ్ సూపరింటెండెంట్లకు, అసిస్టెంట్ చీఫ్ ఎగ్జామినర్లకు శుక్రవారం శిక్షణ జరిగింది. పరీక్షల నిర్వహణకు 2010 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 74,483 మంది పరీక్షకు హాజరుకానున్నారన్నారు. కాకినాడలో 15 సెంటర్లు ఏర్పాటు చేయగా 9,429 మంది రాస్తారన్నారు. హాల్ టిక్కెట్లు సక్రమంగా ఉంటేనే లోనికి పంపాలని సూచించారు
వీఆర్‌ఏ, వీఆర్‌ఓ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
Published Sat, Feb 1 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement
Advertisement