AP: ఇంట్లో పేలిన డిటోనేటర్లు.. వీఆర్‌ఏ మృతి | Detonators Exploded In VRAs House In Pulivendula, VRA Died | Sakshi
Sakshi News home page

AP: ఇంట్లో పేలిన డిటోనేటర్లు.. వీఆర్‌ఏ మృతి

Published Mon, Sep 30 2024 7:34 AM | Last Updated on Mon, Sep 30 2024 9:43 AM

Detonators Blast In Pulivendula Vra Died

సాక్షి,వైఎస్సార్‌జిల్లా: పులివెందుల నియోజకవర్గంలోని వేముల కొత్తపల్లి గ్రామంలో వీఆర్‌ఏ ఇంట్లో డిటోనేటర్లు పేలాయి. ఈ పేలుడులో వీఆర్‌ఏ నరసింహులు మృతి చెందగా అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

అక్రమ మైనింగ్ కోసం దాచి ఉంచిన డిటోనేటర్ల వల్లే పేలుడు జరినట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి చెందిన ఓ హైటెక్‌ టీడీపీ నేత బైరెటీస్‌ అక్రమ మైనింగ్ కోసం ఈ డిటోనేటర్లు తెచ్చినట్లు సమాచారం. ఇలా తెచ్చిన డిటోనేటర్లు వాడి వీఆర్‌ఏ నరసింహులును హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అక్రమ సంబంధం నేపథ్యంలో నరసింహులు నిద్రపోతున్న మంచం కింద డిటోనేటర్ పెట్టినట్లు తెలుస్తోంది.

 

ఇదీ చదవండి: పేదల ప్రాణాలంటే లెక్కలేదా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement