detonator
-
రైల్వే ట్రాక్‌పై డిటోనేటర్.. తప్పిన పెను ప్రమాదం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదానికి కుట్రపన్నిన వైనం వెలుగు చూసింది. డెహ్రాడూన్‌లోని రైల్వే ట్రాక్‌పై డిటోనేటర్ లభ్యం కావడంతో కలకలం చెలరేగింది. హరిద్వార్ నుంచి డెహ్రాడూన్ వెళ్లే రైల్వే ట్రాక్ పై ఈ డిటోనేటర్ పడివుంది.పండుగల సమయంలో ఎవరో రైలు ప్రమాదానికి కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే రైల్వే ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఉదంతపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ డిటోనేటర్‌ను ఈ వ్యక్తి అమర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ట్రాక్‌పై డిటోనేటర్ ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే స్థానిక పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు రంగంలోకి దిగాయి. ఇంతలో రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న దృశ్యం సీసీ కెమెరాలో కనిపించింది. పోలీసులు వెంటనే ఆ యువకుడిని గుర్తించి, అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఆ యువకుడిని ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన అశోక్‌గా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు అతనిని విచారిస్తున్నారు.ఇది కూడా చదవండి: బీఆర్ఐ నుంచి తప్పుకుని.. చైనాకు షాకిచ్చిన బ్రెజిల్ -
AP: ఇంట్లో పేలిన డిటోనేటర్లు.. వీఆర్ఏ మృతి
సాక్షి,వైఎస్సార్‌జిల్లా: పులివెందుల నియోజకవర్గంలోని వేముల కొత్తపల్లి గ్రామంలో వీఆర్ఏ ఇంట్లో డిటోనేటర్లు పేలాయి. ఈ పేలుడులో వీఆర్ఏ నరసింహులు మృతి చెందగా అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్రమ మైనింగ్ కోసం దాచి ఉంచిన డిటోనేటర్ల వల్లే పేలుడు జరినట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి చెందిన ఓ హైటెక్ టీడీపీ నేత బైరెటీస్ అక్రమ మైనింగ్ కోసం ఈ డిటోనేటర్లు తెచ్చినట్లు సమాచారం. ఇలా తెచ్చిన డిటోనేటర్లు వాడి వీఆర్ఏ నరసింహులును హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అక్రమ సంబంధం నేపథ్యంలో నరసింహులు నిద్రపోతున్న మంచం కింద డిటోనేటర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: పేదల ప్రాణాలంటే లెక్కలేదా -
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తారమతిపేట ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా పేలుడు పదార్థాలను తరలిస్తున్న నలుగురు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18 వందల జెలిటిన్ స్టిక్స్, 16 వందల డిటోనేటర్లతో పాటు రూ. 1.43 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
డిటోనేటర్ పేలి యువకుడి దుర్మరణం
వ్యవసాయ బావిలో పూడిక తీత పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. డిటోనేటర్ పేలిపోవడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్ జిల్లా బోయిన్పల్లి మండలం అనంతపల్లి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈ విషాదం చోటు చేసుకుంది. ఓ రైతు పొలంలోని బావిలో పూడికతీత కోసం వలస కూలీ శివరాత్రి శ్రీకాంత్ (20) డిటోనేటర్ అమర్చే క్రమంలో అది చేతిలోనే పేలిపోయింది. తీవ్ర గాయాలతో అతడు మృతి చెందాడు. మృతుడు వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. -
జిలెటిన్‌స్టిక్స్ పేలి ఒకరిమృతి
-
డిటోనేటర్ పేలి వ్యక్తి మృతి
జిల్లాలోని నాగర్‌కర్నూల్ అటవీప్రాంతంలో డిటోనేటర్ పేలి ఓ వ్యక్తి మరణించాడు. దేవరకద్రకు చెందిన ఇందిరమ్మ(40), లింగయ్య(45) అనే దంపతులు అడవి పందుల వేట కోసం శనివారం నాగూర్ కర్నూల్‌కు వెళ్లారు. అటవీ ప్రాంతంలో డిటోనేటర్లు ఉపయోగించి పందులును వేటాడేందుకు వెళుతుండగా ప్రమాదవశాత్తు ఓ డిటోనేటర్ పేలి లింగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, తీవ్రంగా గాయాలైన ఇందిరమ్మను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందిరమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
ఆరో తరగతి విద్యార్థి చేతిలో పేలిన డిటోనేటర్
వరంగల్ : వరంగల్ జిల్లాలో ఓ విద్యార్థి చేతిలో డిటోనేటర్ పేలిన ఘటన శుక్రవారం స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే రఘునాథపురం మండలం ఇబ్రహీంపురంలో ఆరో తరగతి విద్యార్థికి రోడ్డుమీద డిటోనేటర్ దొరికింది. దాంతో అతడు స్కూల్లో ఆడుకుంటుండగా హఠాత్తుగా పేలింది. ఈ సంఘటనలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్ తరలించారు. కాగా డిటోనేటర్ ఎక్కడది అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు.