రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తారమతిపేట ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తారమతిపేట ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా పేలుడు పదార్థాలను తరలిస్తున్న నలుగురు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18 వందల జెలిటిన్ స్టిక్స్, 16 వందల డిటోనేటర్‌లతో పాటు రూ. 1.43 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.