జిల్లాలోని నాగర్కర్నూల్ అటవీప్రాంతంలో డిటోనేటర్ పేలి ఓ వ్యక్తి మరణించాడు. దేవరకద్రకు చెందిన ఇందిరమ్మ(40), లింగయ్య(45) అనే దంపతులు అడవి పందుల వేట కోసం శనివారం నాగూర్ కర్నూల్‌కు వెళ్లారు.
అటవీ ప్రాంతంలో డిటోనేటర్లు ఉపయోగించి పందులును వేటాడేందుకు వెళుతుండగా ప్రమాదవశాత్తు ఓ డిటోనేటర్ పేలి లింగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, తీవ్రంగా గాయాలైన ఇందిరమ్మను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందిరమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
డిటోనేటర్ పేలి వ్యక్తి మృతి
Published Sat, Apr 18 2015 7:14 PM | Last Updated on Sun, Sep 3 2017 12:28 AM
Advertisement
Advertisement