
'సీమాంధ్రలోని ప్రతి జిల్లాలో రాహుల్ ప్రచారం'
సీమాంధ్ర లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులు ఎంపికపై చర్చ పూరైందని ఏపీ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరా రెడ్డి వెల్లడించారు.
సీమాంధ్ర లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులు ఎంపికపై చర్చ పూరైందని ఏపీ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరా రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఉదయం న్యూఢిల్లీ నుంచి రఘువీరా రెడ్డి, చిరంజీవి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్బంగా రఘువీరారెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... సీమాంధ్రలో 163 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారైయ్యారని, సాయంత్రంలోగా మిగిలిన స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేస్తుందని తెలిపారు. రేపటిలోగా సీమాంధ్ర అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సీమాంధ్రలోని ప్రతి జిల్లాలో ప్రచారం చేస్తారని రఘువీరా రెడ్డి తెలిపారు.