
బాబు తేలుకుట్టిన దొంగ
‘శాంతి భద్రతల విషయంపై అసెంబ్లీలో మూడు రోజులుగా చర్చ జరుగుతున్నా తేలుకుట్టిన దొంగలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారు..
ఏపీలో శాంతభద్రతలు క్షీణించాయి
పీసీసీ అధ్యక్షుడు రఘువీరా, బొత్స ధ్వజం
కర్నూలు : ‘శాంతి భద్రతల విషయంపై అసెంబ్లీలో మూడు రోజులుగా చర్చ జరుగుతున్నా తేలుకుట్టిన దొంగలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారు... ఈ విషయమై ఆయన స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నారు. మూడు నెలల టీడీపీ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయి. రాయలసీమలో హత్యలు, దాడులు జరుగుతున్నాయి.. ప్రభుత్వ ఆస్తులు దోపిడీకి గురవుతున్నాయి..’ అని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.
శనివారం కర్నూలులోని నిర్వహించిన పార్టీ సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల ముందు రైతు, డ్వాక్రా, చేనేత రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు..లక్ష కోట్లకుపైగా అవసరమవుతుందని చెప్పారు.. కానీ, బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు మాత్రమే చంద్రబాబు కేటాయించారన్నారు.