ఆనందపేట (గుంటూరు): రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు గుంటూరును కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేపడుతోంది. బీజేపీ, టీడీపీలు రాష్ట్ర ప్రజలను మోసం చేయడాన్ని నిరసిస్త్తూ ఈనెల 2వ తేదీ స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలోని బళ్ళారి రాఘవ ఆడిటోరియంలో సామూహిక దీక్షా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ కోటి సంతకాల కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి జిన్నాటవర్ సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ, సభా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హిందూకళాశాల సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఐదు రోజులపాటు నిరాహార దీక్ష శిబిరాన్ని కొనసాగించారు.
పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డితోపాటు, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులు రెండు ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు ఒంచైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ మరోసారి గుంటూరులో సామూహిక దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితోపాటు, పార్టీ రాష్ట్రముఖ్య నాయకులు హాజరు కానున్నారని జిల్లా నాయకులు వెల్లడించారు.
ప్రత్యేక హోదా కోసం..
Published Sat, May 2 2015 1:56 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement