
'ప్రత్యేక హోదా కోసం మౌనదీక్ష'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో 26వ తేదీన మౌనదీక్ష చేపట్టాలని ఏపీసీసీ నిర్ణయించింది. ప్రత్యేక హోదా..ఆంధ్రుల హక్కు అని, ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు ఏపీకి అన్యాయం చేశాయని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు చేసిందని చెప్పారు. బీజేపీ, టీడీపీల మోసాలపై రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ శ్రేణులు గాంధీజీ విగ్రహాల వద్ద జాతీయ జెండాలను చేతబూని, నల్లబ్యాడ్జీలతో మౌనదీక్ష చేపడతాయని రఘువీరారెడ్డి వెల్లడించారు.