కాపు ఉద్యమకారులతో ఏపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు.
హైదరాబాద్: కాపు ఉద్యమకారులతో ఏపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. సోమవారం ఉదయం చిరంజీవితో కలిసి కిర్లంపూడి వెళ్లేందుకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రికి పయనమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమను రాజమండ్రిలో అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోన కిర్లంపూడికి వెళ్లి తీరతామని స్పష్టం చేశారు. ఏడాదిన్నర ఆలస్యంగా జస్టిస్ మంజునాథ కమిషన్ వేసిన ప్రభుత్వం ఇప్పటికీ సభ్యులను నియమించలేదని విమర్శించారు. 2 నెలల్లో కాపుల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించవచ్చని తెలిపారు. తుని ఘటన సహా ఉద్యమానికి సంబంధించిన అన్ని ఘటనలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.