
'అబద్ధపు హామీలతో పూర్తిగా ముంచారు'
విశాఖపట్నం: అనంతపురం జిల్లా ఉరవకొండలో యువరైతు ఆత్మహత్యకు టీడీపీ సర్కారే కారణమని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. అబద్ధపు హామీలతో రైతులను పూర్తిగా ముంచేశారని ధ్వజమెత్తారు.
శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఓటుకు కోట్లు కేసులో రూ. 50 లక్షలతో పట్టుబడ్డ రేవంత్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం, ఓటుకు కోట్లు కేసుపై రెండు, మూడు రోజుల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామని ఆయన తెలిపారు.