
చలో ఢిల్లీ పోస్టర్ విడుదల చేసిన రాహుల్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పునర్ విభజన చట్టం అమలు కోసం కోటి సంతకాల సేకరణకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. న్యూఢిల్లీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇందుకు సంబంధించి గురువారం ఓ పోస్టర్ విడుదల చేశారు. కోటి సంతకాల సేకరణతో మార్చి 12న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.
కోటి సంతకాలు సేకరించి రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఆ రోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా, పునర్ విభజన చట్టం సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేయనున్నట్లు ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పేర్కన్నారు. ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ జైరాం రమేష్, పార్టీ ఎంపీలు కేవీపీ రామచందర్ రావు, ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, జేడీ శీలం, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.