'బీజేపీ డబుల్‌గేమ్ ఆడుతోంది'
విశాఖపట్నం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై బీజేపీ డబుల్‌గేమ్ ఆడుతోందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. పంటల రుణమాఫీపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.
మరోవైపు ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా బలోపేతం చేయాలనే దానిపై పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పాల్గొన్నారు.