గోరంట్ల, న్యూస్‌లైన్: హిందూపురం పార్లమెంట్ సభ్యుడు నిమ్మల కిష్టప్ప తనయుడు నిమ్మల అంబరీష్ వివాహం గోరంట్లలో గురువారం వైభవంగా నిర్వహించారు. వివాహ వేడుకలలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆయన తనయుడు నారా లోకేష్, రాష్ట్ర రెవెన్యూ శాఖమంత్రి ఎన్.రఘువీరారెడ్డి, ఎంపీలు అనంత వెంకటరామిరెడ్డి, నామా నాగేశ్వరరావు, సుజనచౌదరి, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ శివప్రసాద్, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, పల్లె రఘునాథరెడ్డి, బీకే పార్థసారథి, అబ్దుల్‌ఘనీ, ఎమ్మెల్యే గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎంపీ కాలువ శ్రీనివాసులు, పార్టీ నేతలు వర్లరామయ్య, హనుమంతరాయచౌదరి, ప్రభాకర్ చౌదరి, మహాలక్ష్మి శ్రీనివాస్, కేటీ శ్రీధర్, అంబిక లక్ష్మినారాయణ పాల్గొన్నారు.
చంద్రబాబుకు సమైక్య సెగ
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అనంతపురం జిల్లా గోరంట్లలో గురువారం సమైక్య సెగ తగిలింది. ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయుడు అంబరీష్ దంపతులను ఆశీర్వదించి పక్కకు రాగానే.. సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు అక్కడికి చేరుకొని సమైక్య నినాదాలు చేశారు.
వాహనంలో ఎక్కి కూర్చొని వెళ్లబోగా చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని వారించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయాలని చంద్రబాబుకు సమైక్యవాదులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ప్రముఖ పురోహితుడు, మాజీ డీజీపీ అరవిందరావు సమీప బంధువు స్వామి తారానాథ్.. చంద్రబాబును కలిసి రాష్ట్ర ప్రజల ఆశయాలు నెరవేర్చాలని కోరారు. ‘ప్రజలందరూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలా ఉంచే శక్తి మీకుందని భావిస్తున్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చండి’ అంటూ విన్నవించారు. పెళ్లికి హాజరై తిరిగి వెళ్తున్నమంత్రి రఘువీరా కాన్వాయ్‌ని కూడా సమైక్యవాదులు అ డ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల సహాయం తో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఘనంగా ఎంపీ నిమ్మల తనయుడి వివాహం
Published Fri, Nov 8 2013 3:01 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement