venkatreddy
-
ఇలాంటి తప్పుడు పోస్టులు పెడుతున్న పచ్చ మీడియాను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?
-
నాగార్జున సాగర్ డ్యామ్ కట్టిందే కాంగ్రెస్ పార్టీ
-
హేతుబద్ధీకరణ సరికాదు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: ఆగస్టు నెలలో రేషనలైజేషన్ చేయాలనే విద్యాశాఖ నిర్ణయం సరికాదని ఏఐటీఓ సెక్రటరీ జనరల్ పి.వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 10మంది విద్యార్థులున్న పాఠశాలలను విద్యాసంవత్సరం ప్రారంభమైన రెండు నెలల తర్వాత ఇతర పాఠశాలల్లో విలీనం చేయాలని, కొన్ని పాఠశాలలను మూసి వేయాలని నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు విద్యకు దూరమై డ్రాపౌట్స్ పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం రేషనలైజేషన్ చేస్తూపోతే ప్రభుత్వ పాఠశాలలు మూతపడతాయని, ప్రైవేటు పాఠశాలలు బలోపేతమవుతాయని తెలిపారు. ప్రజాప్రతినిధులు గ్రామాల్లోని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరే విధంగా ప్రోత్సహించాలని కోరారు. -
ఫ్యాన్సీ నంబర్ రూ. 4.8 లక్షలు
హైదరాబాద్: వాహనాల ఫ్యాన్సీ నంబర్ల కోసం వినియోగదారులు పోటీపడి మరి భారీ మొత్తం చెల్లించి దక్కించుకుంటున్నారు. తమకు నచ్చిన నంబరు కావాలనుకున్న వారు.. ఎంత రేటు పెట్టడానికైనా వెనుకాడడం లేదు. తాజాగా గురువారం టీఎస్ 11 ఈఎఫ్ 9999 నంబర్ రూ. 4.8 లక్షల ధర పలికింది. మలక్‌పేట్ ఆర్టీవో పరిధిలో వెంకట్‌రెడ్డి అనే వ్యాపారి ఈ నంబర్‌ను దక్కించుకున్నాడు. మలక్‌పేట్ పరిధిలో ఇంత మొత్తానికి నంబర్ అమ్ముడు పోవడం ఇదే మొదటి సారి అని ఆర్టీవో అధికారులు తెలిపారు. గత వారంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో టీఎస్ 09 ఈఎల్ 9999 ఫ్యాన్సీ నంబర్‌కు రూ.10 లక్షలు వెచ్చించిన విషయం తెలిసిందే. -
అయ్యో..పాపం!
రోడ్డు ప్రమాదంలో తెగిపడ్డకాలు కోరుట్ల : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మోకాలు వరకు తెగిపోయిన హృదయవిదారక ఘటన కోరుట్ల మండలం మోహన్‌రావు పేట గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు చెందిన వెంకట్‌రెడ్డి(35) జగిత్యాల నుంచి కోరుట్ల వైపు మోటార్‌సైకిల్‌పై వస్తుండగా మోహన్‌రావుపేట క్రాసింగ్ వద్ద ఎదురుగా వస్తున్న మెట్పల్లి డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకటరెడ్డి కుడి కాలు మోకాలు వరకు తెగిపోయి రోడ్డుపై పడిపోయింది. సంఘటన స్థలంలో కొద్ది సేపటికి సృ్పహా కోల్పోయిన వెంకటరెడ్డిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రైతు ఆత్మహత్యలు అరికట్టాలి
షాద్‌నగర్: సీఎం కేసీఆర్ రైతుల శవాలపై బంగారు తెలంగాణ నిర్మిస్తారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆత్మహత్యలకు పాల్పడిన చేసుకున్న రైతు కుటంబాలను పరామర్శిం చేందుకు పది వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన రైతు భరోసా బస్సు యాత్ర శని వారం షాద్‌నగర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక ముఖ్యకూడలిలో ఏ ర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కరెంట్ కోత లు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. చిన్న, సన్న, పేద రైతులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీని వర్తింపజేస్తామని చెప్పి, 25శాతమే ఇచ్చారని విమర్శించారు. బంగారు తెలంగాణ ఏర్పాటులో రైతులు కూడా భాగస్వాములే అని వారి బాగోగుల ను కూడా పట్టించుకోవాలని ప్రభుత్వానికి హితవుపలికారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు సారంపల్లి మల్లారెడ్డి మా ట్లాడుతూ.. బంగారు తెలంగాణ రాష్ట్రం ఏ ర్పాటు చేస్తానని మాటలు చెబుతున్న కేసీఆర్ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై ఎం దుకు స్పందించలేదన్నారు. బడ్డెట్‌కు ముం దే ప్రభుత్వ లెక్కల ప్రకారం 80 మంది రై తులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి బడ్జెట్లో వారికి తక్కువ కేటాయింపులు ఉన్నాయని పేర్కొన్నారు. వామపక్షనేతలు అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ నాయకులు పానుగంటి పర్వతాలు, రాజు, నాగమణి, టంగుటూరి నర్మింహారెడ్డి పాల్గొన్నారు. రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న నిర్లక్ష్యం వైఖరివల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. రైతు భరోసా బస్సుయాత్ర శనివారం జిల్లా కేంద్రానికి చేరింది. ఈ సందర్భంగా స్థానిక అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత కుటుంబాలను రూ.ఐదులక్షల పరిహారం ఇవ్వాలన్నారు. రైతులు ప్రైవేటుగా తీసుకున్న రుణాలను మాఫీచేయాలని కోరారు. వ్యవసాయానికి ఏడుగంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేం ద్ర, రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా, రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలనే డిమాం డ్తో పది వామపక్షాల ఆధ్వర్యం లో ఈనెల 11న హైదారాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బాధిత కుటుంబాలతో ధ ర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం సీపీఎం నేతలు సారంపల్లి మల్లారెడ్డి, శివా జీ, కోటేశ్వర్రావు, అచ్చుతారావు, వీర య్య, ఉపేందర్‌రెడ్డి మాట్లాడారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బా ర్, వెంకటేశ్, చంద్రకాంత్, ఆంజనేయులు, నరేష్, రాము పాల్గొన్నారు. -
కాకతీయ హైస్కూల్ యాజమాన్యంపై కేసు
తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి వెల్లడి తూప్రాన్: రైలు ప్రమాదానికి కారణమైన మెదక్ జిల్లా తూప్రాన్‌లోని కాకతీయ హైస్కూల్ యాజమాన్యంపై మెదక్ డిప్యూటీ డీఈఓ శామ్యూల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు స్థానిక డీఎస్పీ వెంకట్‌రెడ్డి తెలిపారు. గురువారం మాసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద రైలు వస్తున్న విషయాన్ని చూసుకోకుండా ఈ స్కూల్ బస్సును డ్రైవర్ పట్టాలపైకి తీసుకెళ్లడంతో రైలు ఢీకొని 14 మంది విద్యార్థులతోపాటు డ్రైవర్, క్లీనర్ మృతి చెందగా, మరో 20 మంది గాయపడిన విషయం విదితమే. ఈ విషయమై డీఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బస్సుకు 50 ఏళ్లు దాటిన వ్యక్తిని డ్రైవర్‌గా పెట్టుకున్నారని, అలాగే, బస్సులో తప్పనిసరిగా ఉండాల్సిన పాఠశాల ఉపాధ్యాయుడు ఎవరూ లేరని డిప్యూటీ డీఈఓ తన ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. నిబంధనలు పాటించని యాజమాన్యంపై జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ చిల్డ్రన్ యాక్ట్-23 ప్రకారం ఐపీసీ 304ఎ, 337, 338 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. అలాగే, ప్రమాదానికి బాధ్యులైన పాఠశాల యాజమాన్యాన్ని త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ చెప్పారు. -
భర్త హత్య కేసులో భార్య, కొడుకుల అరెస్ట్
తాగుడుకు బానిసై వేధింపులకు గురిచేస్తున్న భర్తను ఉరివేసి చంపిన కేసులో పోలీసులు భార్యను అరెస్ట్ చేశారు. అయితే తండ్రిని హత్య చేసేందుకు తల్లికి సహకరించినందుకు మృతుడి ఇద్దరు కొడుకులను కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనగామ డీఎస్పీ కే.సురేందర్ నిందితుల వివరాలు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి ఇంటివద్ద ఉంటున్న మండలంలోని గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన బోకూరి వెంకటరెడ్డి(45) కొద్ది నెలలుగా తాగుడుకు బానిసయ్యాడు. అయితే ఏ పనిచేయకుండా ఇంట్లో డబ్బులు తీసుకుని వెళ్లి తాగివస్తున్న వెంకటరెడ్డి భార్య ను రోజు అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన మృతుడు వెంకటరెడ్డిని ఈనెల 4వ తేదీన తెల్లవారుజామున అతడి భార్య వీరలక్ష్మి, కొడుకులు వినోద్‌రెడ్డి, స్వర్ణాకర్రెడ్డిల సహకారంతో గొంతునులిమి టవల్‌తో ఫ్యాను కు ఉరివేసి హతమార్చింది. అనంతరం కేసు నుంచి తప్పించుకునేందుకు వారంతా మృతు డి నోటిలో పురుగుల మందుపోసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే మరుసటి రోజు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మృతుడు వెంకటరెడ్డి సోదరుడు ఆయన మృతిపై అనుమానం వ్యకం చేస్తూ కుటుంబసభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి వీరలక్ష్మి, ఆమె కొడుకు వినోద్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. మరో కుమారుడు స్వర్ణాకర్రెడ్డి మైనర్ కావడంతో అతడిని జువైనల్ కోర్టుకు పం పిం చినట్లు డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐ నారాయణరావు, ఎస్సై రాజేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చంపడంతో సమస్యలు పరిష్కారం కావు.. తాగుడుకు బానిసై చిత్రహింసలకు గురిచేసే భర్తలను క్షణికావేశంలో చంపితే సమస్యలు పరిష్కారం కావని డీఎస్పీ సురేందర్ అన్నారు. తొందరపాటుతో కుటుంబసభ్యులను చంపి సమాజంలో దోషులుగా నిలువద్దని ప్ర జలకు సూచించారు. కుటుంబ సమస్యలతో బాధపడేవారికి ప్రతి సోమవారం డీఎస్పీ కార్యాలయం లో కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. -
‘పోస్టులను’ అప్‌గ్రేడ్ చేయాలి
కంఠేశ్వర్, న్యూస్‌లైన్ : పీఈటీ, పండిట్ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా పరిషత్‌లో పీఆర్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పదో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాత్కాలిక భృతిని 50 శాతం పెంచాలన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత ఉపాధ్యాయులకు రెండు ఇంక్రిమెంట్లు ఇప్పిస్తామన్నారు. పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో పీఆర్టీయూను మరింత బలోపేతం చేస్తామని యూనియన్ జిల్లా అద్యక్షుడు కమాలాకర్ రావు పేర్కొన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలొ సంఘం ప్రధాన కార్యదర్శి శంకర్, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీపాదరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ విఠల్‌గురూజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరోత్తంరెడ్డి, యూనియన్ జిల్లా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఎంపీ నిమ్మల తనయుడి వివాహం
గోరంట్ల, న్యూస్‌లైన్: హిందూపురం పార్లమెంట్ సభ్యుడు నిమ్మల కిష్టప్ప తనయుడు నిమ్మల అంబరీష్ వివాహం గోరంట్లలో గురువారం వైభవంగా నిర్వహించారు. వివాహ వేడుకలలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆయన తనయుడు నారా లోకేష్, రాష్ట్ర రెవెన్యూ శాఖమంత్రి ఎన్.రఘువీరారెడ్డి, ఎంపీలు అనంత వెంకటరామిరెడ్డి, నామా నాగేశ్వరరావు, సుజనచౌదరి, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ శివప్రసాద్, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, పల్లె రఘునాథరెడ్డి, బీకే పార్థసారథి, అబ్దుల్ఘనీ, ఎమ్మెల్యే గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎంపీ కాలువ శ్రీనివాసులు, పార్టీ నేతలు వర్లరామయ్య, హనుమంతరాయచౌదరి, ప్రభాకర్ చౌదరి, మహాలక్ష్మి శ్రీనివాస్, కేటీ శ్రీధర్, అంబిక లక్ష్మినారాయణ పాల్గొన్నారు. చంద్రబాబుకు సమైక్య సెగ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అనంతపురం జిల్లా గోరంట్లలో గురువారం సమైక్య సెగ తగిలింది. ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయుడు అంబరీష్ దంపతులను ఆశీర్వదించి పక్కకు రాగానే.. సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు అక్కడికి చేరుకొని సమైక్య నినాదాలు చేశారు. వాహనంలో ఎక్కి కూర్చొని వెళ్లబోగా చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని వారించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయాలని చంద్రబాబుకు సమైక్యవాదులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ప్రముఖ పురోహితుడు, మాజీ డీజీపీ అరవిందరావు సమీప బంధువు స్వామి తారానాథ్.. చంద్రబాబును కలిసి రాష్ట్ర ప్రజల ఆశయాలు నెరవేర్చాలని కోరారు. ‘ప్రజలందరూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలా ఉంచే శక్తి మీకుందని భావిస్తున్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చండి’ అంటూ విన్నవించారు. పెళ్లికి హాజరై తిరిగి వెళ్తున్నమంత్రి రఘువీరా కాన్వాయ్‌ని కూడా సమైక్యవాదులు అ డ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల సహాయం తో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
మీ భరోసాతోనే మా చెరువులకు నీరు
గుంతకల్లు, న్యూస్‌లైన్:‘రైతుల పట్ల మీరు చూపించిన అభిమానం, శ్రద్ధ వల్లే హంద్రీ నీవా కాలువ నుంచి తమ చెరువులకు కృష్ణా జలాలు చేరాయని వైటీ చెరువు, పాత కొత్తచెరువు గ్రామాల రైతులు, ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డిని అభినందించారు. మంగళవారం దాదాపు 200 మంది రైతులు తరలి వచ్చి ఆయన స్వగృహంలో కలిశారు. హంద్రీ నీవా కాలువ నుంచి జలాలు పాత కొత్తచెరువు, వైటీ చెరువు, గుత్తి చెరువులకు నీరు చేరాలంటే కసాపురం గ్రామ రైతుల పట్టా భూముల మీదుగా పారాల్సి ఉంటుంది. దీంతో వారు తమ పొలాల మీదుగా నీటిని మళ్లిస్తున్నందున తీవ్రంగా నష్ట పోతున్నామని, నీటిని వదలరాదంటూ అభ్యంతర పెట్టారు. ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా వెళ్లి నీటి విడుదలకు సహకరించాల్సిందిగా సదరు రైతులను అభ్యర్థించారు. తమకు గత ఏడాది ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇప్పిస్తామని చెప్పినా, ఇంతవరకు మంజూరు చేయించలేదని, ఇపుడు ఎలా అడుగుతారని నిర్ద్వందంగా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో వైవీఆర్ చొరవ తీసుకుని కసాపురం రైతులను ఒప్పించారు. తద్వారా పాత కొత్తచెరువు కింద 1,600 ఎకరాలు, వైటీ చెరువు కింద 900 ఎకరాలు మేరకు సాగుకు అవకాశం ఏర్పడింది. ఇదంతా మీ చలువ వల్లనే సాధ్యమైందంటూ వైవీఆర్‌ను రైతులు కొనియాడారు. ఈ రెండు చెరువుల కింద వందల సంఖ్యలో చేపలు పట్టి జీవనాన్ని గడిపే బెస్త వారు కూడా ఉన్నారన్నారు. భవిష్యత్తులో కూడా రైతులకు ఇదే విధంగా సహాయ, సహకారాలు అందించాలని రైతులు వైవీఆర్ కోరారు.