రైతు ఆత్మహత్యలు అరికట్టాలి | Preventing farmer suicides | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యలు అరికట్టాలి

Published Sun, Dec 7 2014 2:10 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM

Preventing farmer suicides

షాద్‌నగర్: సీఎం కేసీఆర్ రైతుల శవాలపై బంగారు తెలంగాణ నిర్మిస్తారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆత్మహత్యలకు పాల్పడిన చేసుకున్న రైతు కుటంబాలను పరామర్శిం చేందుకు పది వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన రైతు భరోసా బస్సు యాత్ర శని వారం షాద్‌నగర్‌లో ప్రారంభమైంది.
 
 ఈ సందర్భంగా స్థానిక ముఖ్యకూడలిలో ఏ ర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కరెంట్ కోత లు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. చిన్న, సన్న, పేద రైతులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీని వర్తింపజేస్తామని చెప్పి, 25శాతమే ఇచ్చారని విమర్శించారు. బంగారు తెలంగాణ ఏర్పాటులో రైతులు కూడా భాగస్వాములే అని వారి బాగోగుల ను కూడా పట్టించుకోవాలని ప్రభుత్వానికి హితవుపలికారు.
 
 అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు సారంపల్లి మల్లారెడ్డి మా ట్లాడుతూ.. బంగారు తెలంగాణ రాష్ట్రం ఏ ర్పాటు చేస్తానని మాటలు చెబుతున్న కేసీఆర్ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై ఎం దుకు స్పందించలేదన్నారు. బడ్డెట్‌కు ముం దే ప్రభుత్వ లెక్కల ప్రకారం 80 మంది రై తులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి బడ్జెట్‌లో వారికి తక్కువ కేటాయింపులు ఉన్నాయని పేర్కొన్నారు. వామపక్షనేతలు అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ నాయకులు పానుగంటి పర్వతాలు, రాజు, నాగమణి, టంగుటూరి నర్మింహారెడ్డి పాల్గొన్నారు.
 
 రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి
 జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న నిర్లక్ష్యం వైఖరివల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. రైతు భరోసా బస్సుయాత్ర శనివారం జిల్లా కేంద్రానికి చేరింది. ఈ సందర్భంగా స్థానిక అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత కుటుంబాలను రూ.ఐదులక్షల పరిహారం ఇవ్వాలన్నారు. రైతులు ప్రైవేటుగా తీసుకున్న రుణాలను మాఫీచేయాలని కోరారు. వ్యవసాయానికి ఏడుగంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
 
  కేం ద్ర, రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా, రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలనే డిమాం డ్‌తో పది వామపక్షాల ఆధ్వర్యం లో ఈనెల 11న హైదారాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బాధిత కుటుంబాలతో ధ ర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం సీపీఎం నేతలు సారంపల్లి మల్లారెడ్డి, శివా జీ, కోటేశ్వర్‌రావు, అచ్చుతారావు, వీర య్య, ఉపేందర్‌రెడ్డి మాట్లాడారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బా ర్, వెంకటేశ్, చంద్రకాంత్, ఆంజనేయులు, నరేష్, రాము పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement