హేతుబద్ధీకరణ సరికాదు
Published Sun, Jul 24 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: ఆగస్టు నెలలో రేషనలైజేషన్ చేయాలనే విద్యాశాఖ నిర్ణయం సరికాదని ఏఐటీఓ సెక్రటరీ జనరల్ పి.వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 10మంది విద్యార్థులున్న పాఠశాలలను విద్యాసంవత్సరం ప్రారంభమైన రెండు నెలల తర్వాత ఇతర పాఠశాలల్లో విలీనం చేయాలని, కొన్ని పాఠశాలలను మూసి వేయాలని నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు విద్యకు దూరమై డ్రాపౌట్స్ పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం రేషనలైజేషన్ చేస్తూపోతే ప్రభుత్వ పాఠశాలలు మూతపడతాయని, ప్రైవేటు పాఠశాలలు బలోపేతమవుతాయని తెలిపారు. ప్రజాప్రతినిధులు గ్రామాల్లోని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరే విధంగా ప్రోత్సహించాలని కోరారు.
Advertisement
Advertisement