not correct
-
సీఎం వ్యాఖ్యలు దారుణం: పెంటపాటి
ఏలూరు: సిఎం చంద్రబాబుకు సామాజికవేత్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు ఓ ప్రకటనలో కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును ఆపడానికి తాను ప్రధానమంత్రిని కలిశానని సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం దారుణమన్నారు. పోలవరం ప్రాజెక్టులో ఐదు లక్షల మంది నిర్వాసితుల సమస్య ఉందన్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే ప్రధానిని కలిసి సమస్యలను పరిష్కరించాలని కోరానని తెలిపారు. నిర్వాసితులకు అందాల్సిన సొమ్ము కేంద్ర చట్టాల ప్రకారం రావాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, సామాన్యులు కోర్టుకు వెళ్లడాన్ని తప్పుపడుతున్న చంద్రబాబు విభజన హామీలపై కోర్టును ఆశ్రయిస్తామని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. -
ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా..
సాక్షి, ఏలూరు: మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. మంత్రి పదవిలో ఉండి సంస్కారహీనంగా మాట్లాడటం ఆయనకు సరికాదన్నారు. మంత్రి తమను శత్రువులుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిలో మంత్రితో పోటీ పడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మాణిక్యాలరావు సిద్ధంగా ఉన్నారా అని బాపిరాజు ప్రశ్నించారు. -
నీ మేనేజ్మెంట్ ఇదేనా
డీఎం అండ్ హెచ్ఓ పద్మజారాణిపై పూనం మాలకొండయ్య మండిపాటు గుంటూరు మెడికల్ : ‘నీవు ప్రోగ్రామ్ చేయగలవా లేదా... నీ మేనేజ్మెంట్ ఇదేనా... నీ కమాండ్ ఏమీ బాగాలేదు’- అంటూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య మండిపడ్డారు. గుంటూరు వైద్య కళాశాలలో సోమవారం స్వాస్థ్య విద్యావాహిని వాహనాలను పూనం మాలకొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే వైద్య విద్యార్థులకు ప్రత్యేకంగా బ్యాడ్జీ, ఐఈసీ మెటీరియల్‌తో కూడిన బ్యాగ్‌లను అందజేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య విద్యార్థులు సర్వే చేయాల్సిన అంశాలతో రూపొందించిన పత్రాలు బ్యాగ్‌లలో లేకపోవటాన్ని గమనించిన పూనం మాలకొండయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన కార్యక్రమంపై అవగాహన కల్పించేలా రూపొందించిన బ్యానర్లు కట్టకపోవటం, సర్వే పత్రాలు బ్యాగ్‌లలో పెట్టకపోవటంతో డీఎం అండ్ హెచ్ఓపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే డీఎంహెచ్ఓ తన వద్ద ఉన్న ఓ సర్వే పత్రాన్ని వైద్య కళాశాలలో ఫోటోస్టాట్ కాపీలు తీయించి వైద్య విద్యార్థుల బ్యాగ్‌లలో పెట్టారు. ఉదయం ఏడుగంటల కల్లా వాహనాలు ప్రారంభం కావాల్సి ఉండగా 7.30 గంటల వరకు బయలు దేరకపోవటంతో వైద్యాధికారులకు పూనం మాలకొండయ్య క్లాస్ తీసుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో స్వాస్థ్య విద్యావాహిని కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో పరిశీలించేందుకు ఆమె వైద్య విద్యార్ధుల వాహనాలతో పాటుగా వెళ్ళారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అరుణకుమారి, ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ డి.షాలినీదేవి, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, ఎస్పీఎం వైద్య విభాగాధిపతి డాక్టర్ ఆర్. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజారోగ్యానికి భరోసా కల్పించడమే ధ్యేయం సత్తెనపల్లి: ప్రజల ఆరోగ్య సంరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ సరికొత్త విధానానికి నాంది పలికిందని, రోగాలు వచ్చినప్పుడు వైద్యం చేసేకంటే రోగాలు వ్యాప్తి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పించి ప్రజారోగ్యానికి భరోసా ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ పూనం మాలకొండయ్య ఆదేశించారు. సోమవారం ఆకస్మికంగా సత్తెనపల్లి వచ్చిన ఆమె చంద్రన్న సంచార వైద్యసేవల వాహనాలు వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఉండటంతో వాటిని పరిశీలించారు. అనంతరం సత్తెనపల్లి మండలం భట్లూరు గ్రామంలో స్వాస్థ్య విద్యా వాహిని కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య అలవాట్లపై అవగాహన కల్పించేలా స్వాస్థ్య విద్యావాహిని కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. చంద్రన్న సంచార చికిత్స శిబిరాలు జరిగే రోజున గ్రామాల్లో స్వాస్థ్య విద్యావాహిని బృందాలు కూడా పర్యటిస్తాయన్నారు. నెలకో అంశంపై బృందాలు ప్రజలకు వివరిస్తాయన్నారు. మెడికోలు, నర్సింగ్ విద్యార్థులు, దంత వైద్య విద్యార్థులు, అసిస్టెంట్ సర్జన్ బృందంలో ఉంటారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది వైద్య విద్యార్థులకు ఈ బాధ్యతలు అప్పగించామన్నారు. ఈసందర్భంగా వైద్య విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాల,అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె సందర్శించి చిన్నారులతో చేతుల శుభ్రత, తదితర వాటి పై మాట్లాడారు. కార్యక్రమంలో వైద్య అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు. -
ఉగ్రవాదుల దాడులు గర్హనీయం
–బీజేపీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం –పలు పాఠశాలల్లో నివాళులర్పించిన విద్యార్థులు కోదాడఅర్బన్: కశ్మీర్‌లోని యూరీసెక్టార్‌లో భారత సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేయడం గర్హనీయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నూనె సులోచన అన్నారు. ఉగ్రవాదుల దాడిలో పాకిస్తాన్ చర్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఆ దేశం అండతోనే ఉగ్రవాదులు సైనిక స్థావరంపై దాడిచేశారన్నారు. కాశ్మీర్లో దుశ్చర్యలకు పాల్పడుతున్న పాకి స్తాన్‌కు కేంద్ర ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కారమంచి రామకోటి, నకిరికంటి జగన్మోహన్రావు, కొదుమూరి ప్రవీణ్, సాతులూరి సాంబశివరావు, నాగమల్లేశ్వరరావు, కిలారు వెంకటేశ్వర్లు, సయ్యద్ మతీన్, చిన్నా, రాజోలు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్ఎం పాఠశాలలో........ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన భారత సైనికులకు మంగళవారం పట్టణంలోని ఎస్ఆర్ఎం పాఠశాల విద్యార్థులు ç నివాళులర్పించారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కేశినేని శ్రీదేవి, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వైష్ణవి పాఠశాలలో.... పట్టణంలోని వైష్ణవి పాఠశాల విద్యార్థులు ఉగ్రవాదుల దాడులలో మృతిచెందిన సైనికులకు కొవొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధాయుడు లక్ష్మణశర్మ, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదు
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సత్తెనపల్లి: సత్తెనపల్లి మండలం గుడిపూడి ఎస్టీ కాలనీలో పేదల గుడిసెలు ఉన్నపళంగా కూల్చి వేసేందుకు అధికారులు చట్టాలను చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లంచర్ల సాంబశివరావు గహంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2000 సంవత్సరంలో సుమారు 312 మందికి పైగా నిరుపేదలకు నివేశన స్థలాల పట్టాలు ఇచ్చారని, గత కొంతకాలంగా తమను ఖాళీచేయించాలనే ప్రయత్నాలు స్థానిక నాయకులు చేస్తుండటంతో పేదలు గమనించి కోర్టును ఆశ్రయించారన్నారు. గహాలు నిర్మించుకోక పోవడం వల్ల ఖాళీ చేయిస్తున్నామని ప్రభుత్వం తరఫున కోర్టులో వాదన వినిపించారని, నిజంగా ఇళ్ళు వేసుకోకపోతే డ్యూ ప్రాసెస్ ప్రకారం నోటీసులు ఇచ్చి వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఇంతవరకు డ్యూ ప్రాసెస్ చేపట్టకుండానే రెవెన్యూ అధికారులు రికార్డులను ట్యాంపరింగ్ చేస్తున్నారని అంబటి ఆరోపించారు. హఠాత్తుగా ఖాళీ చేయించేందుకు ప్రొక్లెయిన్లతో, పోలీసు బలగాలతో వెళ్లారని, ఇది మంచిది కాదన్నారు. నిజంగా గహాలు నిర్మించుకోకపోతే చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి వారిని ఖాళీ చేయించాలన్నారు. కేవలం స్థానిక ఎమ్మెల్యే, వారి తాబేదారుల ఒత్తిడి మేరకు అధికారులు చట్టాలను చేతుల్లోకి తీసుకుంటున్నారని అంబటి ఆరోపించారు. కోర్టులు, చట్టాలను అధికారులు మోసం చేయడం భావ్యం కాదన్నారు. ఈరోజు అధికారంలో ఉన్న పాలకులు కాపాడవచ్చని, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించడానికి ఉన్న పోలీసులను గుడిసెలు కూల్చడానికి వినియోగించడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి రాజకీయాలకతీతంగా నిరుపేదలకు న్యాయం చేయాలన్నారు. దీనిపై ఇప్పటికే జిల్లాకలెక్టర్‌తో మాట్లాడామన్నారు. అంతేకాక వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, సీపీఐ, సీపీఎం రాష్ట్ర నేతల దష్టికి కూడా ఈవిషయాన్ని పేదలు తీసుకువెళ్లారన్నారు. పేద ప్రజలకు అండగా నిలిచి వారి కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరాన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లంచర్ల సాంబశివరావు, పార్టీ మండల అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, యూత్ సెల్ పట్టణ, మండల అధ్యక్షులు అచ్యుత్ శివప్రసాద్, కళ్ళం విజయభాస్కరరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కట్టా సాంబయ్య, గుడిపూడి వాసులు తదితరులు పాల్గొన్నారు. -
హేతుబద్ధీకరణ సరికాదు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: ఆగస్టు నెలలో రేషనలైజేషన్ చేయాలనే విద్యాశాఖ నిర్ణయం సరికాదని ఏఐటీఓ సెక్రటరీ జనరల్ పి.వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 10మంది విద్యార్థులున్న పాఠశాలలను విద్యాసంవత్సరం ప్రారంభమైన రెండు నెలల తర్వాత ఇతర పాఠశాలల్లో విలీనం చేయాలని, కొన్ని పాఠశాలలను మూసి వేయాలని నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు విద్యకు దూరమై డ్రాపౌట్స్ పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం రేషనలైజేషన్ చేస్తూపోతే ప్రభుత్వ పాఠశాలలు మూతపడతాయని, ప్రైవేటు పాఠశాలలు బలోపేతమవుతాయని తెలిపారు. ప్రజాప్రతినిధులు గ్రామాల్లోని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరే విధంగా ప్రోత్సహించాలని కోరారు. -
సభ వాయిదా అనైతిక చర్య
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల గుంటూరు వెస్ట్ : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ప్రై వేట్ బిల్లుపై సభలో చర్చ జరగకుండా బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరించిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. బీజేపీ తీరును నిరసిస్తూ శనివారం గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ వరకు సీపీఐ నాయకులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ బిల్లు విజయం సాధిస్తుందని భావించి సభ జరగకుండా వాయిదా వేయడం అనైతిక చర్యగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, బీజేపీకి చెందిన రాష్ట్ర నాయకులు అందరూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. ప్రత్యేక హోదా సాధించడం ద్వారానే రాష్ట్రాభివద్ధి సాధ్యమన్నారు. సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ ఏపీకి ప్యాకేజీలు వద్దని హోదా కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు సురేష్, నూతలపాటి చిన్న, అమీర్‌వలి, కుమార్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్న ప్రొజెక్టును అడ్డుకోవడం కరెక్ట్ కాదు
-
ప్రజలను నిర్వాసితులను చేస్తే సహించం
- రైతులు, ప్రజల పొట్టగొట్టే ప్రభుత్వ తీరు మారకపోతే ఉద్యమం - బందరులో జరిగే ఉద్యమాలకు అండగా ఉంటాం - పది వామపక్ష పార్టీల సమావేశ నిర్ణయం సాక్షి, విజయవాడ: బందరు పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ కోసం లక్ష ఎకరాల భూమి సమీకరించేలా సోమవారం నోటిఫికేషన్ జారీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పది వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. బందరు పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో తీరప్రాంతంలోని మత్స్యకారులు, రైతులు, ప్రజల జీవనాన్ని దెబ్బతీసే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామని ప్రకటించారు. భూమిని కాపాడుకునేందుకు బందరు ప్రాంతానికి చెందిన రైతులు, ప్రజలు జరిపే ఉద్యమాలకు బాసటగా నిలవాలని నిర్ణయించారు. విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకుడు గుర్ర విజయ్‌కుమార్ అధ్యక్షతన పది కమ్యూనిస్టు పార్టీల సమావేశం ఆదివారం రాత్రి జరిగింది. సమావేశ నిర్ణయాలను పది వామపక్షపార్టీల నేతలు పత్రికలకు విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంటు నిర్మాణం వల్ల రాష్ర్ట ప్రజలకు జరిగే నష్టాన్ని వివరిస్తూ ఈ నెల 17న విశాఖలో నిర్వహించనున్న జాతీయ సెమినార్‌పై ప్రచారం నిర్వహిస్తున్న సీపీఎం నాయకులను పోలీసులను అరెస్టు చేయడాన్ని నాయకులు ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రజాస్వామిక వాదులంతా నిరసించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. విశాఖలో అరెస్టు చేసిన సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ నర్శింగరావు, నగర కార్యదర్శి బి.గంగారావులతో పాటు 26మంది నాయకులను, కార్యకర్తలను విడుదల చేయాలని, పోలీసులు స్వాధీనం చేసుకున్న ప్రచార వాహనాన్ని వెంటనే విడిచిపెట్టాలని కోరారు. సమావేశంలోపి.మధు, వై.వెంకటేశ్వర్లు(సీపీఎం), కె.రామకృష్ణ, ముప్పాళ్లనాగేశ్వరరావు, జెల్లివిల్సన్(సీపీఐ), పి.ప్రసాద్, యు.వెంకటేశ్వర్లు(సీపీఐఎంఎల్-న్యూడెమోక్రసీ), హరినాథ్, సత్యనారాయణ(సీపీఐఎంఎల్-లిబరేషన్), పి.రామారావు(సీపీఐఎంఎల్-న్యూడెమోక్రసీ), పి.సుందరామరాజు, అజీం పాషా, సుభాష్ చంద్రారెడ్డి(ఫార్వర్డ్‌బ్లాక్), కిషోర్(సీపీఐఎంఎల్) హాజరయ్యారు. -
'జూనియర్ డాక్టర్ల సమ్మె దురదృష్టకరం'
గుంటూరు: రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మెకు దిగడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శనివారం గుంటూరులో కామినేని విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని... వాటిని అర్థం చేసుకోవాలని జూనియర్ డాక్టర్లకు కామినేని హితవు పలికారు. జూడాల న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పడూ సిద్ధంగానే ఉంటుందన్నారు. హైకోర్టు ఉత్తర్వులు వచ్చాక ప్రబుత్వం తరఫున స్పందిస్తామని కామినేని చెప్పారు.