
ఉగ్రవాదుల దాడులు గర్హనీయం
–బీజేపీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం
–పలు పాఠశాలల్లో నివాళులర్పించిన విద్యార్థులు
కోదాడఅర్బన్: కశ్మీర్‌లోని యూరీసెక్టార్‌లో భారత సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేయడం గర్హనీయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నూనె సులోచన అన్నారు. ఉగ్రవాదుల దాడిలో పాకిస్తాన్ చర్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఆ దేశం అండతోనే ఉగ్రవాదులు సైనిక స్థావరంపై దాడిచేశారన్నారు. కాశ్మీర్‌లో దుశ్చర్యలకు పాల్పడుతున్న పాకి స్తాన్‌కు కేంద్ర ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కారమంచి రామకోటి, నకిరికంటి జగన్‌మోహన్‌రావు, కొదుమూరి ప్రవీణ్, సాతులూరి సాంబశివరావు, నాగమల్లేశ్వరరావు, కిలారు వెంకటేశ్వర్లు, సయ్యద్ మతీన్, చిన్నా, రాజోలు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఆర్‌ఎం పాఠశాలలో........
కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన భారత సైనికులకు మంగళవారం పట్టణంలోని ఎస్‌ఆర్‌ఎం పాఠశాల విద్యార్థులు ç నివాళులర్పించారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కేశినేని శ్రీదేవి, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వైష్ణవి పాఠశాలలో....
పట్టణంలోని వైష్ణవి పాఠశాల విద్యార్థులు ఉగ్రవాదుల దాడులలో మృతిచెందిన సైనికులకు కొవొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధాయుడు లక్ష్మణశర్మ, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.