
గ్రామ, వార్డు సచివాలయాలను రేషనలైజేషన్ చేస్తూ చంద్రబాబు సర్కార్ జారీ చేసిన జీవోపై
సాక్షి, గుంటూరు: గ్రామ, వార్డు సచివాలయాలను రేషనలైజేషన్ చేస్తూ చంద్రబాబు సర్కార్ జారీ చేసిన జీవోపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. సచివాలయాల సంఖ్య, సిబ్బంది కుదింపు తప్ప సమస్యల పరిష్కారంపై ఆలోచించడం లేదంటూ ఆయన ధ్వజమెత్తారు. గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్‌పై చీఫ్ సెక్రటరీకి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, కమిటీ వేయడం, సిబ్బందితో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ధ్వజమెత్తారు. 516 సేవలు సచివాలయాల ద్వారా అందిస్తున్నారు. 11 కోట్ల అర్జీలు సచివాలయాల ద్వారా పరిష్కారమయ్యాయి. జాబ్ చాట్ అమలు జరగడం లేదు.. సపోర్టింగ్ స్టాఫ్‌గా ఉపయోగిస్తున్నారు. ఒక్క సెలవుకి ముగ్గురు నలుగురు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది.
రేషనలైజేషన్ ద్వారా సమస్య పరిష్కరం కాకపోగా మరింత పెరుగుతుంది. 11 మంది చేసే పని ఆరుగురితో చేయించాలని ప్రభుత్వం చూస్తుంది. రేషనలైజేషన్ చేసే ముందు ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవాలి. ఉద్యోగ సంఘాలతో చర్చించి రేషనలైజేషన్ చేపట్టాలి. తక్షణమే రేషనలైజేషన్ జీవో నిలుపుదల చేయాలి’’ అని వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు.
