Venkata rami reddy
-
హైకోర్టులో సోషల్ మీడియా యాక్టివిస్ట్ వెంకటరామిరెడ్డి పిటిషన్
-
అధికారం ఇచ్చింది పరిపాలించడానికా లేక పగ తీర్చుకోవడానికా..!
-
ఓటమి భయంతోనే టీడీపీ హింసా రాజకీయాలు: ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో టీడీపీ హింసా రాజకీయాలను ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఎస్పీ అమిత్ బర్దర్ సమక్షంలోనే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్‌పై దాడి జరిగిందని.. ఎస్పీ, ఏఎస్పీ రామకృష్ణ చౌదరి ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీసుల సహకారంతోనే తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు జరిగాయన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల దౌర్జన్యం అమానుషమని.. ఏఎస్పీ రామకృష్ణ చౌదరిని కూడా సస్పెండ్ చేయాలని అనంతవెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు.చంద్రబాబు డైరెక్షన్లోనే..: విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఓటమి భయంతోనే టీడీపీ హింసా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లో ఇష్టారాజ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం వల్లే ఎన్నికల్లో హింస చెలరేగిందన్నారు. రౌడీషీటర్లు, ఖూనీకోర్లను పయ్యావుల కేశవ్ పోలింగ్ ఏజెంట్లగా పెట్టారు. తాడిపత్రిలో టీడీపీ అరాచకాలకు పోలీసులే నైతిక బాధ్యత వహించాలని విశ్వేశ్వరరెడ్డి అన్నారు.టీడీపీ దాడులు.. పిరికిపంద చర్య: వీరాంజనేయులుటీడీపీ-జనసేన-బీజేపీలకు ఓటమి భయం పట్టుకుందని..అందుకే వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు అన్నారు.తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి పిరికిపంద చర్యగా భావిస్తున్నామన్నారు. -
కొన్ని వేల ఉద్యోగాలిచ్చిన ఘనత వైఎస్ఆర్ ది
-
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు కుర్మయ్యగారి నవీన్‌రావు, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఆ ముగ్గురు అభ్యర్థులు గురువారం అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ధ్రువీకరణపత్రాలు అందుకున్నారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితోపాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ముగ్గురు నేతలు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్సీలు నవీన్‌రావు, గంగాధర్‌గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం ఈ నెల 29న ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక కోసం ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదల కాగా అదేరోజు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఈ నెల 9న బీఆర్ఎస్ అభ్యర్థులుగా నవీన్‌రావు, దేశపతి శ్రీనివాస్ చల్లా వెంకట్రామిరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికాగా, బీఆర్ఎస్కు ఆ ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. -
సీఎం జగన్‌ను ఘనంగా సన్మానిస్తాం
సాక్షి, అమరావతి: సెప్టెంబర్ చివర లేదా అక్టోబర్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విజయవాడలో భారీ సభ నిర్వహించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఘనంగా సన్మానించాలని నిర్ణయించినట్టు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి చెప్పారు. శుక్రవారం విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేయడం, నాలుగు నెలల్లో 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేయడంతో పాటు వాటిని భర్తీ కూడా చేశారని చెప్పారు. అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారిలో అర్హులైన ఉద్యోగులందరి సర్వీసును ఈ ఏడాది జూన్ 30 నాటికి పర్మినెంట్ కూడా చేశారని వివరించారు. తాజాగా సచివాలయాల ఉద్యోగుల బదిలీల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు సీఎం జగన్‌కి మానస పుత్రిక లాంటివని, ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నారని చెప్పారు. మనందరికీ మంచి చేసే ప్రభుత్వం ఉందని, ఇలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు అందరం సక్రమంగా పని చేద్దామన్నారు. ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని వెంకట్రామిరెడ్డి తప్పుపట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కొన్ని వ్యవస్థలు సైతం కంట్రోల్ చేయాలని చూస్తున్నాయని విమర్శించారు. గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎలా వ్యవహరించారో చూశామన్నారు. కడపలో సచివాలయ ఉద్యోగిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజన్‌రెడ్డి కోరారు. సచివాలయాల ఉద్యగులను ప్రభుత్వం పర్మినెంట్ చేయదని కొందరు చేసిన తప్పుడు ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ సీఎం అందరినీ పర్మినెంట్ చేశారని సంఘం ప్రధాన కార్యదర్శి బి.అంకమరావు చెప్పారు. ఉద్యోగులతో మంచిగా ఉండే సీఎం ఉండటం మన అదృష్టమని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు ఆర్ఆర్ కిషోర్ భార్గవ్ సుతేజ్, విపర్తి నిఖిల్‌కృష్ణ, సుధాకర్, రామకృష్ణ, మధు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ సచివాలయంలో ఉద్యోగులకు ఆనందయ్య మందు పంపిణీ
అమరావతి: ఏపీ సచివాలయంలో ఉద్యోగులకు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చేతుల మీదుగా బుధవారం ఆనందయ్య మందు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి సహకారంతో ఆనందయ్య మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఉద్యోగుల భవిష్యత్ దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: కోడలిని వేధించిన పాపం..! -
వారికి ఇకపై సంవత్సరం పాటు వారానికి 5 రోజులే పనిదినాలు!
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 5 రోజుల పనిదినాలను మరో ఏడాదిపాటు పొడిగించారు. వచ్చే ఏడాది వరకు దీనిని పొడిగిస్తూ సీఎస్ నీల్నం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఉద్యోగులు, అన్నిశాఖల హెచ్ఓడీ కార్యాలయ ఉద్యోగులకు వర్తించనుంది. ఈ సందర్భంగా ఏపీ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ‘ఉద్యోగుల సమస్యలన్నింటిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తున్నారు . ఉద్యోగులకు మేలు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. ఉద్యోగులు మరింత బాగా పనిచేసేలా ఈ ఉత్తర్వులు ఇవ్వడం సంతోషకరం’ అని ఆనందం వ్యక్తం చేశారు. (సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ఎస్పీవీ) -
ముంబైలో అనంత వాసులు.. సీఎం చొరవతో
సాక్షి, గుంతకల్లు(అనంతపురం): లాక్డౌన్ నేపథ్యంలో ముంబైలో చిక్కుకున్న వలస కూలీలను రప్పించేందుకు చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గుంతకల్లు ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ చొరవతో ముంబైలో చిక్కుకున్న 1080 మందికి పైగా అనంత వాసులు ప్రత్యేక రైలులో బుధవారం గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. వలస కూలీల బాధలపై సీఎం జగన్ తక్షణమే స్పందించిన విషయాన్ని గుర్తుచేశారు. వలస కూలీలకు ప్రభుత్వం అన్ని వసుతుల కల్పిస్తోందన్నారు. పేదలకు ఉచిత రేషన్, రూ. వెయ్యి నగదు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని ప్రశంసించారు. ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రతీ పనిని విమర్శించడం మానుకోవాలని హితవుపలికారు. ఏపీలో ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని సూచించారు. కరోనాపై కలిసికట్టుగా పోరాటం చేయాలని ఈ క్రమంలో సీఎం జగన్‌కు సహకరించాలని ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
కోడెల తనయుడి అక్రమాలకు అడ్డేలేదు
గుంటూరు: స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామకృష్ణ అక్రమాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోయిందని టీడీపీకి చెందిన తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి పులిమి వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం పేరుతో అక్రమ కేసులు బనాయించి తమను వేధిస్తున్నారని గుంటూరు రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడికి సోమవారం ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రత్యేక అధికారితో విచారణ జరిపించాలని కోరారు. అనంతరం వెంకటరామిరెడ్డి పాలపాడు గ్రామస్తులతో కలసి మీడియాతో మాట్లాడారు. పోలీస్, రెవెన్యూ అధికారులను కోడెల శివరామకృష్ణ తన చెప్పుచేతల్లో పెట్టుకొని.. ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. దీనిపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు ఎంపీ రాయపాటి సాంబశివరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులకు ఫిర్యాదు చేయగా.. వారు స్పందించలేదన్నారు. పార్టీ ప్రతిష్టను కాపాడుకునేందుకు ఈ నెల 15న తన నివాసంలో ఆమరణ దీక్షకు దిగగా.. వెయ్యి మంది టీడీపీ కార్యకర్తలు సంఘీభావం తెలిపారని చెప్పారు. దీన్ని సహించలేని శివరామకృష్ణ పోలీసులతో దీక్షను భగ్నం చేయించారని ధ్వజమెత్తారు. అదే సమయంలో శివరామకృష్ణ వర్గానికి చెందిన వ్యక్తులు పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. కానీ ఈ ఘటననూ తమకు అంటగడుతూ 29 మందిపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. అదేమని ప్రశ్నిస్తే రౌడీషీట్ తెరుస్తామంటూ పోలీసులు బెదిరిస్తున్నారని వాపోయారు. చివరకు విద్యార్థులపైనా కేసు నమోదు చేయడం దారుణమన్నారు. దీనిపై ప్రత్యేక అధికారితో దర్యాప్తు చేయించాలని ఎస్పీని కోరామన్నారు. -
ఊసరవెల్లి
మతతత్వ పార్టీలతో పొత్తు ఊసే లేదని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుకుని ఊసరవెల్లి నైజాన్ని నిరూపించుకున్నాడని ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం తన ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, సీపీఎం పట్టణ కార్యదర్శి పోలా రామాంజనేయులు, సీపీఐ పట్టణ కార్యదర్శి జింకా చలపతిలతో కలసి మాట్లాడారు. బీజేపీతో పొత్తు చారిత్రాత్మక తప్పిదమని 2009 ఎన్నికల్లో ఓటమి అనంతరం చెప్పిన చంద్రబాబు, మీకోసం పాదయాత్రలో ఒకడుగు ముందుకు వేసి మతతత్వ పార్టీలతో పొత్తు ఊసే లేదని ప్రకటించాడన్నారు. ప్రస్తుతం మోడీ ద్వారా లబ్ధి పొందే లక్ష్యంతో అదే బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకున్నాడన్నారు. తమ పార్టీకి వామపక్షాలతో పొత్తు కుదరడంతో ధర్మవరం మునిసిపల్ ఎన్నికల్లో సీపీఎంకు 5,6 వార్డులు, సీపీఐకి 2వ వార్డు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం శంకరనారాయణ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్షం స్థాయిలో వామపక్షాలు పోరాడాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పూటకోమాట మాట్లాడుతూ జనాలను తప్పుదోవపట్టిస్తున్నాడని విమర్శించారు. బీజేపితో పొత్తుపెట్టుకుని ముస్లిం మైనార్టీలకు ద్రోహం చేస్తున్నాడని దుయ్యబట్టారు. సీపీఎం నాయకులు పోలా రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌తో పాటు చంద్రబాబుకూ భాగం ఉందన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఢిల్లీకి వినిపిస్తే, ప్రస్తుత అధ్యక్షుడు రాజ కీయ ప్రయోజనాల కోసం తెలుగుజాతిని విచ్ఛిన్నం చేశాడన్నారు. సీపీఐ నాయకులు జింకా చలపతి మాట్లాడుతూ వైఎస్సార్సీపీతో కలిసి పనిచేయడం తమకు సంతృప్తినిస్తోందన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం పోరాడిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అని, ఆ పార్టీని ఆదరించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకలు గుండాపురుషోత్తం, సీఐటీయూ నాయకులు ఎస్‌హెచ్ బాషాలు పాల్గొన్నారు. -
అంబరం అంటిన సంబరం
అనంతపురం కల్చరల్, న్యూస్‌లై న్ : కోటి ఆశల పల్లకిలో వచ్చిన నూతన సంవత్సరానికి జిల్లా వాసులు ఘనంగా స్వాగతం పలికారు. బుధవారం వాడవాడలా సంబరాలు అంబరాన్నంటాయి. సామాన్యులు మొదలుకునిప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సంవత్సరం సకల శుభాలతో ప్రశాంతంగా గడిచిపోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. అనంతపురం లోక్‌సభ సభ్యుడు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే గురునాథరెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తోపుదుర్తి కవిత, మాజీ మేయర్ రాగే పరశురామ్, వైఎస్సార్ సీపీ నాయకులతో పాటు జిల్లా అధికారులు న్యూ ఇయర్ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలపడానికి వందలాది మంది తరలిరావడంతో కలెక్టరేట్ జనసంద్రంగా మారింది. కొత్త సంవత్సరంలో జిల్లా వాసులు సుఖశాంతులతో జీవించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతపురం నగరంలోని పాఠశాలలు, కళాశాలలలోనూ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వన్నూరు డాన్స్ అకాడమీ చిన్నారులు స్థానిక అంబేద్కర్ నగర్లో మెగా డాన్స్ హంగామా సృష్టించారు. సంబరాల వల్ల నగరంలోని రోడ్లన్నీ రద్దీగా కన్పించాయి. వ్యాపారాలకు జోష్ నూతన సంవత్సర సంబరాలతో ముడిపడిన వ్యాపారాలు అంచనాలకు మించి సాగాయి. నగరంలో స్వీట్లు, పూలు, పండ్ల వ్యాపారాలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు స్థాయిలో జరిగినట్లు దుకాణదారులు చెబుతున్నారు. స్వీటు స్టాళ్లు ఇరవై నాలుగు గంటలూ కిటకిటలాడాయి. స్వీట్లు, బేకరీ వ్యాపారమే రూ.కోటి దాటింది. విద్యార్థులు చాక్లెట్లు, ప్యాకెట్ క్యాలెండర్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుకోవడంతో చాలాచోట్ల వాటి స్టాకు అయిపోయింది. పండ్లు, పూల వ్యాపారాలు వేటికవే పోటీపడ్డాయి. వీటి అమ్మకాలు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు సాగివుంటుందని అంచనా. సాధారణ రోజుల్లో రూ.పది ఉండే మూర పూలు రూ.30 పలకడం గమనార్హం. నూతన సంవత్సరం ప్రారంభ రోజున కొత్త దుస్తులు ధరించాలన్న సెంటిమెంట్ వస్త్ర దుకాణదారులకు కలిసొచ్చింది. దుకాణాలతో పాటు ఫుట్పాత్లపైనా వస్త్ర వ్యాపారం జోరుగా సాగింది. ఇక ఆఫర్ల హంగామా వల్ల వివిధ వ్యాపారాలకు జోష్ వచ్చింది. మద్యం ఏరులై పారింది. -
సీమ పౌరుషాన్ని చూపిస్తాం
రాయల తెలంగాణపై సచివాలయ రాయలసీమ ఉద్యోగుల నిరసన ర్యాలీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని ఇష్టమొచ్చినట్టు ముక్కలు చేయడానికి సోనియాకు హక్కు ఎవరిచ్చారని సచివాలయ రాయలసీమ ఉద్యోగుల సంఘం మండిపడింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన సచివాలయ ఉద్యోగులు బుధవారం సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. సీమను విభజిస్తే రాయలసీమ వాసులు పౌరుషమేంటో సోనియాకు రుచిచూపిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యోగ మిత్రులను తాము పల్లెత్తు మాట అనలేదని, కానీ బుధవారం కొంతమంది హెచ్చరించే ధోరణిలో వ్యవహరించడం బాధాకరమని సీమాంధ్ర ఉద్యోగుల సంఘం ప్రతినిధి మురళీకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. సీమ వాసులపై వీహెచ్ వ్యాఖ్యల్ని క్రిష్ణయ్య ఆక్షేపించారు. రాయల తెలంగాణ దుర్మార్గమైన నిర్ణయం: రాయల తెలంగాణ నిర్ణయం దుర్మార్గమైన విషయమని తెలంగాణ ప్రజలు కోరుతున్నది పది జిల్లాల తెలంగాణను మాత్రమే అని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం, తెలంగాణ సచివాలయ నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఆరోపించాయి. ఆయా సంఘాల అధ్యక్షులు నరేందర్‌రావు, శ్రావణ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో బుధవారం సచివాలయంలో వేర్వేరుగా రాయల తెలంగాణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.