వారికి ఇకపై సంవత్సరం పాటు వారానికి 5 రోజులే పనిదినాలు! | AP Govt Extended 5 Working Days Per Week For 1 Year | Sakshi
Sakshi News home page

వారికి ఇకపై సంవత్సరం పాటు వారానికి 5 రోజులే పనిదినాలు!

Published Fri, Jun 26 2020 8:39 PM | Last Updated on Fri, Jun 26 2020 9:10 PM

AP Govt Extended 5 Working Days Per Week For 1 Year - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 5 రోజుల పనిదినాలను మరో ఏడాదిపాటు పొడిగించారు. వచ్చే ఏడాది వరకు దీనిని పొడిగిస్తూ సీఎస్‌ నీల్నం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఉద్యోగులు, అన్నిశాఖల హెచ్‌ఓడీ కార్యాలయ ఉద్యోగులకు వర్తించనుంది.  ఈ సందర్భంగా ఏపీ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ‘ఉద్యోగుల సమస్యలన్నింటిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తున్నారు . ఉద్యోగులకు మేలు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు.  ఉద్యోగులు మరింత బాగా పనిచేసేలా ఈ ఉత్తర్వులు ఇవ్వడం సంతోషకరం’ అని ఆనందం వ్యక్తం చేశారు. (సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ఎస్పీవీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement