వైఎస్‌ జగన్‌: సీఎం కలిసిన 108, 104 ఉద్యోగులు | 108, 104 Ambulance Employees Meet YS Jagan - Sakshi

సీఎం జగన్‌ను కలిసిన 108, 104 ఉద్యోగులు

Oct 31 2019 3:35 PM | Updated on Nov 1 2019 10:53 AM

108 Ambulance Employees Meet YS Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం 108, 104 అంబులెన్స్‌ ఉద్యోగులు కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఉద్యోగ భదత్ర కల్పిస్తానని సీఎం స్పందించడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘108’ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బల్లి కిరణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ..108లలో పనిచేసే టెక్నిషియన్లకు రూ.30వేలు, పైలెట్లకు రూ.28వేలు జీతాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ‘104’లో పనిచేసే ఉద్యోగులకు రూ.28వేలు, డ్రైవర్లకు 26వేలు జీతాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ‘104’ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఫణి, సింహాచలం వెల్లడించారు. ‘104’ వైద్యులకు సర్వీస్‌ వెయిటేజీ ఇచ్చి రాబోయే నియామకాల్లో లబ్ధి చేస్తామని సీఎం తెలిపారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement