nilam sahani
-
ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగంపై ఎన్నికల కమిషనర్‌కు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి,విజయవాడ : స్ధానిక సంస్ధల ఉపఎన్నికల్లో కూటమి పార్టీల అరాచకాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం కలిసింది. రాష్ట్రంలో ఉపఎన్నికల ప్రక్రియను సజావుగా నడిపించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేసింది. రాష్ర ఎన్నికల కమిషన్ నీలం సాహ్నిని కలిసిన వైఎస్సార్సీపీ బృందంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, కొమ్మూరి కనకారావు, అంకంరెడ్డి నారాయణమూర్తి, పలువురు పార్టీనేతలు ఉన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. పిడుగు రాళ్ల ఎన్నిక రద్దు చేయాలి : తాటిపర్తి చంద్రశేఖర్ వైఎస్సార్సీపీ శ్రేణులను భయపెట్టడానికి వారి ఇళ్లను కూల్చివేయడంతో పాటు దాడులకు దిగిడం, పోలీసు వ్యవస్ధను అడ్డం పెట్టుకుని లాఠీల మాటున లూటీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ధానిక సంస్ధల ఉప ఎన్నికల్లో లెక్కకు మించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. పిడుగురాళ్లలో టీడీపీ గెలుపు ఎలాంటిదో అందరికీ తెలుసన్నారు. తునిలో కూటమి పార్టీలకు సరైన సంఖ్యాబలం లేకపోవడం వల్ల ఇప్పటికి రెండు దఫాలుగా వాయిదా పడిందని.. పాలకొండలో ఒకే ఒక ఎస్సీ సభ్యురాలు ఉంటే ఆమెను కూడా వారి పార్టీ తరపున నిలబెట్టే ప్రయత్నం చేయడం దారుణని వ్యాఖ్యానించారు. ప్రజస్వామ్యంలో ఇలాంటి చర్యలను అందరూ ఖండించాలన్నారు. అధికార పార్టీలు చేస్తున్న ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇవాళ ఎలక్షన్ కమిషన్ కలిపి ఫిర్యాదు చేశామని చంద్రశేఖర్ చెప్పారు. వ్యవస్ధలు కేవలం ఒక పార్టీ కోసం పనిచేయడానికి ఏర్పాటు కాలేదన్న ఆయన... రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయా లేదా అన్న ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.ఒక్క సభ్యుడు కూడా లేని చోట కేవలం డబ్బు, అధికార మదం, రాజకీయ అండతో టీడీపీ గెలుస్తుంటే... ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకోవడం సరికాదన్న ఆయన... కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఈ వ్యవహరంలో జోక్యం చేసుకుని పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా చూడ్డంతో పాటు, పిడుగురాళ్లలో మరొక్కసారి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వినతిపత్రం సమర్పించామన్నారు.హద్దుల్లేకుండా దమనకాండ : మల్లాది విష్టు రాష్ట్రంలో ఇవాళ పాలకొండ, తుని, పిడుగురాళ్ల మూడు ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రతినిధులమీద అధికార పార్టీ దౌర్జన్యాలు, కిడ్నాపులు చేస్తూ దమనకాండకు పాల్పడుతుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సజావుగా జరిపించాలని పదే, పదే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తలుపు తడుతున్నా కూడా... స్ధానికంగా ఉన్న ఎస్పీ, కలెక్టర్, ఎన్నికల అధికార్లను సరైన దిశగా నడిపించడం లేదని మండిపడ్డారు. కూటమి నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతుంటే అధికార్లు నిశ్చేష్టులై చూస్తున్నారని ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం ప్రకారం గెలుపోటములుంటాయని.. అలాంటిది వైఎస్సార్సీపీ తరుఫున గెలిచిన వారిని కిడ్నాప్ చేసి వాళ్లతో పోటీ చేయించడం ఏ రకమైన ప్రజాస్వామ్యం అని నిలదీశారు. రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలుపోటములు రాజకీయాల్లో సహజమని.. కానీ ఈ తరహా దాడులు, అధికారుల ఏకపక్ష నిర్ణయాలు అన్నీ రికార్డెడ్‌గా ఉంటాయన్న విషయాన్ని గుర్తించుకోవాలని హెచ్చరించారు.దాడిశెట్టి రాజాపై దాడి.. దేవినేని అవినాష్ ఆగ్రహం స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రతినిధులను అన్యాయంగా, దౌర్జన్యంగా భయపెట్టి ఓట్లేయించుకుంటున్న టీడీపీ నేతల అకృత్యాలపై గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎన్నికల అధికార్లు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. తునిలో అయితే ఏకంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై దాడికి దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పార్టీలు చేస్తున్న ఈ దాడులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేశారు.రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం.. లేళ్ల అప్పిరెడ్డిరాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఉపఎన్నిక ప్రక్రియ మొదలైన తర్వాత కూటమి పార్టీలు చేస్తున్న దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్‌ను వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం నాలుగోసారి కలిసి ఫిర్యాదు చేశామని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. అధికార పార్టీ ఆగడాలను, రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక విధానాలను, వ్యవస్ధలను కాపాడాల్సిన అధికారులు చేష్టలుడిన చూస్తున్న వైనాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప రాష్ట్రంలో అధికారవ్యవస్ధలేవీ పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ పరిణామాలను గమనిస్తున్నారన్నారు. తిరుపతిలో ఒక్క కార్పొరేటర్ గెలిస్తే అక్కడ ఎలా పోటీచేస్తారని ప్రశ్నించారు. పిడుగురాళ్లలో 33 స్ధానాలకు ౩౩ వైఎస్సార్సీపీ .. టీడీపీ నిలబెట్టిన అభ్యర్ధి ఏ పార్టీ తరపున పోటీచేస్తున్నారని నిలదీశారు. తునిలో 30కు 30 స్ధానాలు వైఎస్సార్సీపీ గెలిస్తే అక్కడ మూడుదఫాలు ఉప ఎన్నిక ఎలా వాయిదా వేస్తారన్నారు. రకరకాల ప్రలోభాలకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. కక్కిన కూడుకు ఆశపడే రాజకీయ పార్టీలున్న పరిస్థితుల్లో వ్వవస్ధలైనా సక్రమంగా పనిచేయాలన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించామన్నారు. వందలాది టీడీపీ కార్యకర్తలు రోడ్లమీదకు వచ్చి.. హల్ చల్ చేస్తుంటే... సెక్షన్ 30 లాంటి వన్నీ కేవలం వైఎస్సార్సీపీ కోసమే అన్నట్టు అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపధ్యంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసమే ఛలో తునికి పిలుపునిచ్చామన్నారు. ఎన్నికలు సాఫీగా జరగడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కు మరోక్కసారి విజ్ఞప్తి చేస్తున్నామని అప్పిరెడ్డి తెలిపారు. -
ఎన్నికల ప్రారంభం ప్రక్రియల్లో నీలం సాహ్ని
-
నేడు ఏ పీ ఎస్ ఈ సి గా భాద్యతలు స్వీకరించనున్న నీలం సాహ్ని
-
ఏ పీ ఎన్నికల కమీషనర్ గా నీలం సాహ్ని నియామకం
-
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు. నీలం సాహ్ని పేరును గవర్నర్ బీబీ హరిచందన్ ఆమోదించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య సలహాదారుగా నీలం సాహ్ని ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్ట్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించిన సంగతి తెలిసిందే.. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. చదవండి: పోలవరం ప్రాజెక్టు: మరో కీలక అంకం పూర్తి.. -
ఏలూరు వింత వ్యాధి; కీలక విషయాలు
సాక్షి, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తీవ్రత నెమ్మదిస్తోంది. అయిదోరోజు బాధితుల సంఖ్య తగ్గడంతో ఏలూరు ఊపిరి పీల్చుకుంది. ఇప్పటి వరకు స్థానిక పరీక్షల ఫలితాలు పరిశీలించిన అధికారులు ప్రస్తుతం కేంద్ర సంస్థలు ఇచ్చే నివేదికల కోసం ఎదురు చూస్తున్నారు. ఆయా కేంద్ర సంస్థలు ఈ వ్యాధి వ్యాపించడానికి గల కారణాలను శుక్రవారం నాటికి స్పష్టం చేయనున్నాయని సమాచారం. కాగా ఇప్పటి వరకు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి 26 మంది బాధితులను తరలించగా.. ఇద్దరిని డిశ్చార్జి చేశారు. 24 మంది చికిత్స పొందుతున్నారు. ఏలూరు ఆస్పత్రికి సీఎస్ నీలం సాహ్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఛీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని చేరుకునున్నారు. ఆసుపత్రిలోని భాదితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం అధికారులతో సీఎస్ సమీక్షించనున్నారు. వింత వ్యాధితో చనిపోలేదు ఇతర ఆరోగ్య సమస్యలతో ఏలూరు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారిలో ఇద్దరు మృతి చెందారు. అప్పారావు అనే వ్యక్తి కోవిడ్‌తో, సుబ్బరావమ్మ అనే మహిళ టీబీతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ సందర్భంగా విజయవాడ ప్రభుత్వాసుపత్రి సుపరిండిండెంట్ డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ.. ఏలూరు నుంచి వింత జబ్బుతో వచ్చిన వారు ఎవరూ విజయవాడలో చికిత్స పొందుతూ చనిపోలేదని స్పష్టం చేశారు. ఏలూరు నుంచి వింత జబ్బుతో 25 మంది పేషేంట్లు చేరారని, ఇందులో ఇద్దరని డిశ్చార్జ్ చేశామని వెల్లడించారు. మిగిలిన 23 మంది ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఏలూరు నుంచి వేరే కారణాలతో ప్రతీ రోజూ రెగ్యులర్‌గా కేసులు వస్తుంటాయని.. అలా వచ్చిన వారిలో ఇద్దరు పేషెంట్లు చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు. వీరికి ఏలూరు వింతజబ్బుతో వచ్చిన పేషేంట్లకి ఎలాంటి సంబంధం లేదన్నారు. వదంతులు నమ్మవద్దు గురువారం జిల్లా ఆసుపత్రి ఏవీఆర్ మోహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం 47 మంది బాదితులు చికిత్స పొందుతున్నారన్నారు. ఇప్పటి వరకు ఒకరు మాత్రమే మృతి చెందారన్నారు. డిశ్చార్జి అయిన వారిని ఎప్పటికప్పుడు గ్రామసచివాలయ సిబ్బంది, డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అన్ని విధాలుగా ఈ కేసులు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దయచేసి సోషల్ మీడియాలో వదంతులు నమ్మదని కోరారు. ఎన్ సిడిసి,ఎన్ఐఎన్ అన్ని కోణలో దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. మనుషులతో పాటు జంతువల సాంపిల్స్ సేకరిస్తున్నారని తెలిపారు. ఏలూరు చుట్టుపక్కల గ్రామాలలోను సాంపిల్స్ సేకరిస్తున్నారని. దాల్, రైస్, వెజిటేబుల్స్, రక్తనమూనాల సాంపిల్స్ సేకరిస్తున్నారని పేర్కొన్నారు. మూడో రోజు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఢిల్లీ వైద్య నిపుణుల బృందం పర్యటించిందని, చికిత్స పొందుతున్న భాదితతో మాట్లాడి వివరాలు సేకరించారని తెలిపారు. సచివాలయాల్లో మెడికల్ క్యాంపులు.. ఏలూరులో 62 వార్డు సచివాలయాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఒక వైద్యుడు, నర్సు, ఆరోగ్య సిబ్బంది, సచివా లయ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఎవరికైనా అనా రోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రాథమిక చికిత్స అందిం చి నిమిషాల వ్యవధిలో 108 అంబులెన్సుల ద్వారా జిల్లా ఆస్పత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటా సర్వే చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. కేంద్ర బృందాలు ఏలూరులోనే.. కేంద్ర బృందాలు, వైద్య నిపుణుల బృందాలు ఏలూరులోనే మకాం వేసి అంతు చిక్కని వ్యాధికి గల కారణాలను అన్వేషిస్తు న్నాయి. వివిధ విభాగాల నుంచి పంపించిన కేంద్ర వైద్య బృందం, మంగళగిరి ఎయిమ్స్ బృందం, ఏఐఏ బృందం, ఐపీఎం, ఐఆర్‌సీఐ బృందాలు ప్రస్తుతం ఏలూరులోనే ఉండి బాధితులకు అందే వైద్యంతోపాటుగా కోలుకున్న వారి స్థితిగ తులను తెలుసుకుంటున్నాయి. ఈ బృందాలు ఏలూరులో పరిశీలిస్తున్నాయి. ఆహార పదార్థాలు, పాలు, కూరగాయలు, నివసించే ప్రాంతాల్లో ఉండే మట్టినీ పరీక్షిస్తున్నాయి. నీరు వచ్చే ప్రాంతాలు, పంట ప్రాంతాలను పరిశీలిస్తున్నాయి. -
వారికి ఇకపై సంవత్సరం పాటు వారానికి 5 రోజులే పనిదినాలు!
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 5 రోజుల పనిదినాలను మరో ఏడాదిపాటు పొడిగించారు. వచ్చే ఏడాది వరకు దీనిని పొడిగిస్తూ సీఎస్ నీల్నం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఉద్యోగులు, అన్నిశాఖల హెచ్ఓడీ కార్యాలయ ఉద్యోగులకు వర్తించనుంది. ఈ సందర్భంగా ఏపీ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ‘ఉద్యోగుల సమస్యలన్నింటిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తున్నారు . ఉద్యోగులకు మేలు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. ఉద్యోగులు మరింత బాగా పనిచేసేలా ఈ ఉత్తర్వులు ఇవ్వడం సంతోషకరం’ అని ఆనందం వ్యక్తం చేశారు. (సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ఎస్పీవీ) -
కేంద్రం ముందుకు మండలి రద్దు తీర్మానం..
-
శాసన మండలి రద్దుపై మరో ముందడుగు
సాక్షి, అమరావతి : శాసనమండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. తొలుత శాసనసభ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ తీర్మానాన్ని పంపారు. అనంతరం తీర్మానాన్ని పరిశీలించిన సీఎస్.. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం హోంశాఖ అధికారులకు పంపారు. దీంతో మండలి రద్దు విషయంలో ప్రభుత్వం మరో ముందడుగేసినట్లయింది. పార్లమెంట్ ఉభయ సభలతో పాటు, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం సభ పూర్తిగా రద్దు కానుంది. మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిపై సభ్యులు రోజంతా సుదీర్ఘంగా చర్చించి.. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మండలిని రద్దు చేస్తున్నట్లు సభ్యులంతా తమ ప్రసంగాల్లో స్పష్టం చేశారు. -
ఆర్జీయూకేటీ వ్యవహారంపై కమిటీలు
సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూకేటీ) వ్యవహారాలపై మూడు కమిటీలను నియమించారు. ఆర్జీయూకేటీ పాలక మండలి సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన విద్యాశాఖ కార్యదర్శులు వికాస్‌రాజ్, నీలం సహానీ ఇతర అధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.