సాక్షి, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తీవ్రత నెమ్మదిస్తోంది. అయిదోరోజు బాధితుల సంఖ్య తగ్గడంతో ఏలూరు ఊపిరి పీల్చుకుంది. ఇప్పటి వరకు స్థానిక పరీక్షల ఫలితాలు పరిశీలించిన అధికారులు ప్రస్తుతం కేంద్ర సంస్థలు ఇచ్చే నివేదికల కోసం ఎదురు చూస్తున్నారు. ఆయా కేంద్ర సంస్థలు ఈ వ్యాధి వ్యాపించడానికి గల కారణాలను శుక్రవారం నాటికి స్పష్టం చేయనున్నాయని సమాచారం. కాగా ఇప్పటి వరకు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి 26 మంది బాధితులను తరలించగా.. ఇద్దరిని డిశ్చార్జి చేశారు. 24 మంది చికిత్స పొందుతున్నారు.
ఏలూరు ఆస్పత్రికి సీఎస్ నీలం సాహ్ని
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఛీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని చేరుకునున్నారు. ఆసుపత్రిలోని భాదితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం అధికారులతో సీఎస్ సమీక్షించనున్నారు.
వింత వ్యాధితో చనిపోలేదు
ఇతర ఆరోగ్య సమస్యలతో ఏలూరు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారిలో ఇద్దరు మృతి చెందారు. అప్పారావు అనే వ్యక్తి కోవిడ్‌తో, సుబ్బరావమ్మ అనే మహిళ టీబీతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ సందర్భంగా విజయవాడ ప్రభుత్వాసుపత్రి సుపరిండిండెంట్ డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ.. ఏలూరు నుంచి వింత జబ్బుతో వచ్చిన వారు ఎవరూ విజయవాడలో చికిత్స పొందుతూ చనిపోలేదని స్పష్టం చేశారు. ఏలూరు నుంచి వింత జబ్బుతో 25 మంది పేషేంట్లు చేరారని, ఇందులో ఇద్దరని డిశ్చార్జ్ చేశామని వెల్లడించారు. మిగిలిన 23 మంది ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఏలూరు నుంచి వేరే కారణాలతో ప్రతీ రోజూ రెగ్యులర్‌గా కేసులు వస్తుంటాయని.. అలా వచ్చిన వారిలో ఇద్దరు పేషెంట్లు చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు. వీరికి ఏలూరు వింతజబ్బుతో వచ్చిన పేషేంట్లకి ఎలాంటి సంబంధం లేదన్నారు.
వదంతులు నమ్మవద్దు
గురువారం జిల్లా ఆసుపత్రి ఏవీఆర్ మోహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం 47 మంది బాదితులు చికిత్స పొందుతున్నారన్నారు. ఇప్పటి వరకు ఒకరు మాత్రమే మృతి చెందారన్నారు. డిశ్చార్జి అయిన వారిని ఎప్పటికప్పుడు గ్రామసచివాలయ సిబ్బంది, డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అన్ని విధాలుగా ఈ కేసులు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దయచేసి సోషల్ మీడియాలో వదంతులు నమ్మదని కోరారు. ఎన్ సిడిసి,ఎన్ఐఎన్ అన్ని కోణలో దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. మనుషులతో పాటు జంతువల సాంపిల్స్ సేకరిస్తున్నారని తెలిపారు. ఏలూరు చుట్టుపక్కల గ్రామాలలోను సాంపిల్స్ సేకరిస్తున్నారని. దాల్, రైస్, వెజిటేబుల్స్, రక్తనమూనాల సాంపిల్స్ సేకరిస్తున్నారని పేర్కొన్నారు. మూడో రోజు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఢిల్లీ వైద్య నిపుణుల బృందం పర్యటించిందని, చికిత్స పొందుతున్న భాదితతో మాట్లాడి వివరాలు సేకరించారని తెలిపారు.
సచివాలయాల్లో మెడికల్ క్యాంపులు..
ఏలూరులో 62 వార్డు సచివాలయాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఒక వైద్యుడు, నర్సు, ఆరోగ్య సిబ్బంది, సచివా లయ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఎవరికైనా అనా రోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రాథమిక చికిత్స అందిం చి నిమిషాల వ్యవధిలో 108 అంబులెన్సుల ద్వారా జిల్లా ఆస్పత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటా సర్వే చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు.
కేంద్ర బృందాలు ఏలూరులోనే..
కేంద్ర బృందాలు, వైద్య నిపుణుల బృందాలు ఏలూరులోనే మకాం వేసి అంతు చిక్కని వ్యాధికి గల కారణాలను అన్వేషిస్తు న్నాయి. వివిధ విభాగాల నుంచి పంపించిన కేంద్ర వైద్య బృందం, మంగళగిరి ఎయిమ్స్ బృందం, ఏఐఏ బృందం, ఐపీఎం, ఐఆర్‌సీఐ బృందాలు ప్రస్తుతం ఏలూరులోనే ఉండి బాధితులకు అందే వైద్యంతోపాటుగా కోలుకున్న వారి స్థితిగ తులను తెలుసుకుంటున్నాయి. ఈ బృందాలు ఏలూరులో పరిశీలిస్తున్నాయి. ఆహార పదార్థాలు, పాలు, కూరగాయలు, నివసించే ప్రాంతాల్లో ఉండే మట్టినీ పరీక్షిస్తున్నాయి. నీరు వచ్చే ప్రాంతాలు, పంట ప్రాంతాలను పరిశీలిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment