
సాక్షి, గుంతకల్లు(అనంతపురం): లాక్‌డౌన్ నేపథ్యంలో ముంబైలో చిక్కుకున్న వలస కూలీలను రప్పించేందుకు చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గుంతకల్లు ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ చొరవతో ముంబైలో చిక్కుకున్న 1080 మందికి పైగా అనంత వాసులు ప్రత్యేక రైలులో బుధవారం గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. వలస కూలీల బాధలపై సీఎం జగన్ తక్షణమే స్పందించిన విషయాన్ని గుర్తుచేశారు.
వలస కూలీలకు ప్రభుత్వం అన్ని వసుతుల కల్పిస్తోందన్నారు. పేదలకు ఉచిత రేషన్, రూ. వెయ్యి నగదు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని ప్రశంసించారు. ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రతీ పనిని విమర్శించడం మానుకోవాలని హితవుపలికారు. ఏపీలో ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని సూచించారు. కరోనాపై కలిసికట్టుగా పోరాటం చేయాలని ఈ క్రమంలో సీఎం జగన్‌కు సహకరించాలని ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.