రాయల తెలంగాణపై సచివాలయ రాయలసీమ ఉద్యోగుల నిరసన ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని ఇష్టమొచ్చినట్టు ముక్కలు చేయడానికి సోనియాకు హక్కు ఎవరిచ్చారని సచివాలయ రాయలసీమ ఉద్యోగుల సంఘం మండిపడింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన సచివాలయ ఉద్యోగులు బుధవారం సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. సీమను విభజిస్తే రాయలసీమ వాసులు పౌరుషమేంటో సోనియాకు రుచిచూపిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యోగ మిత్రులను తాము పల్లెత్తు మాట అనలేదని, కానీ బుధవారం కొంతమంది హెచ్చరించే ధోరణిలో వ్యవహరించడం బాధాకరమని సీమాంధ్ర ఉద్యోగుల సంఘం ప్రతినిధి మురళీకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. సీమ వాసులపై వీహెచ్ వ్యాఖ్యల్ని క్రిష్ణయ్య ఆక్షేపించారు.
రాయల తెలంగాణ దుర్మార్గమైన నిర్ణయం: రాయల తెలంగాణ నిర్ణయం దుర్మార్గమైన విషయమని తెలంగాణ ప్రజలు కోరుతున్నది పది జిల్లాల తెలంగాణను మాత్రమే అని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం, తెలంగాణ సచివాలయ నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఆరోపించాయి. ఆయా సంఘాల అధ్యక్షులు నరేందర్‌రావు, శ్రావణ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో బుధవారం సచివాలయంలో వేర్వేరుగా రాయల తెలంగాణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.
సీమ పౌరుషాన్ని చూపిస్తాం
Published Thu, Dec 5 2013 3:27 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement