ఫ్యాన్సీ నంబర్‌ రూ. 4.8 లక్షలు | Fancy number auction for rs.4.8 lakhs in malakpet RTO office | Sakshi
Sakshi News home page

ఫ్యాన్సీ నంబర్‌ రూ. 4.8 లక్షలు

Published Thu, Apr 21 2016 8:24 PM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

Fancy number auction for rs.4.8 lakhs in malakpet RTO office

హైదరాబాద్: వాహనాల ఫ్యాన్సీ నంబర్ల కోసం వినియోగదారులు పోటీపడి మరి భారీ మొత్తం చెల్లించి దక్కించుకుంటున్నారు. తమకు నచ్చిన నంబరు కావాలనుకున్న వారు.. ఎంత రేటు పెట్టడానికైనా వెనుకాడడం లేదు.

తాజాగా గురువారం  టీఎస్ 11 ఈఎఫ్ 9999 నంబర్ రూ. 4.8 లక్షల ధర పలికింది. మలక్‌పేట్ ఆర్టీవో పరిధిలో వెంకట్రెడ్డి అనే వ్యాపారి ఈ నంబర్ను దక్కించుకున్నాడు. మలక్‌పేట్ పరిధిలో ఇంత మొత్తానికి నంబర్ అమ్ముడు పోవడం ఇదే మొదటి సారి అని ఆర్టీవో అధికారులు తెలిపారు. గత వారంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో టీఎస్ 09 ఈఎల్ 9999 ఫ్యాన్సీ నంబర్కు రూ.10 లక్షలు వెచ్చించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement