
కాంగ్రెస్‌ను వీడిన వారంతా ద్రోహులే..
పసీసీ అధ్యక్షుడు రఘువీరా
ఏలూరు: కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిన వారందరూ ద్రోహులేనని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి వివుర్శించారు. కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం ఏలూరు, విజయువాడల్లో సాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యకర్తల సవూవేశాల్లో రఘువీరా మాట్లాడుతూ ఇప్పటి వరకు పదవులు అనుభవించిన కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రి జంప్ జిలానీలుగా మారుతున్నారని వివుర్శించారు.
మంత్రిగా కూడా చేయని కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే ఆయన పార్టీని వదిలిపెట్టి వెళ్లారని ఎద్దేవా చేశారు. కేంద్రవుంత్రి చిరంజీవి వూట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో మళ్లీ ప్రజారాజ్యం పార్టీ పెడితే చాంపియన్‌గా ఉండవచ్చని పలువురు తనకు చెప్పారన్నారు. ప్రజారాజ్యం పార్టీలో సామాజిక న్యాయం పేరుతో బీసీలకు, మైనారిటీలకు, ఎస్సీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినా తగిన ంత ఆదరణ దక్కలేదని, అందుకే మహాశక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. మహాకూటమిలో కలిసి తప్పు చేశానని, బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పిన చంద్రబాబు అదే పార్టీతో ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపన కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ను నిస్సహాయ స్థితిలోకి నెట్టారని చెప్పారు. అవసాన దశలో ఉన్న కాంగ్రెస్‌కు అంద రూ అండగా నిలవాలని కోరారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ తాను జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పారు. కేంద్రమంత్రులు పళ్లంరాజు, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, జేడీ శీలం, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, మాజీమంత్రులు వట్టి వసంత్‌కుమార్, కోండ్రు మురళి, దేవినేని నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.