గుంటూరు: పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం ఈ నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదని వాపోయారు.
బడాబాబుల కోసమే 2 వేల రూపాయల నోటు చెలామణిలోకి తెచ్చారని ఆరోపించారు. 2 వేల రూపాయల నోటుతో సామాన్య, పేద ప్రజలకు చిల్లర కష్టాలు మొదలయ్యాయని అన్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన పెద్ద నోటుకు చిల్లర దొరక్క జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నోట్ల కష్టాలతో దేశవ్యాప్తంగా 70 మంది చనిపోయారని, వీరి కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఎవరి కోసం రద్దు చేశారు: రఘువీరారెడ్డి
Published Tue, Nov 22 2016 2:08 PM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM
Advertisement
Advertisement