
'బాబుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి'
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కూడా అరెస్ట్ చేయాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.
పశ్చిమగోదారి(ఏలూరు): తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కూడా అరెస్ట్ చేయాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం రఘువీరా పశ్చిమగోదావరి జిల్లాలోని కాళ్ల మండలం సీసలిలో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి తమ బాసే ఈ డబ్బును పంపించారని పదే పదే ఒప్పుకున్నారని ఆయన అన్నారు.
డబ్బులిచ్చిన చంద్రబాబుపై మొదటిముద్దాయిగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. గోదావరి జిల్లాల డబ్బులే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు చంద్రబాబు పంపారని దుయ్యబట్టారు.