
'రైతు కక్ష సాధింపు సంస్థ'
హైదరాబాద్: పంట రుణాలను బేషరతుగా మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఏడాదికి 20 శాతం మాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతోందని... వాస్తవానికి రూ. 5 వేల కోట్లతో 50 శాతం రుణాలు మాఫీ అవుతాయన్నారు. రైతులు తీసుకున్న ప్రైవేటు వడ్డీలను ప్రభుత్వమే భరించాలన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసింది రైతు సాధికార సంస్థ కాదని, రైతు కక్ష సాధింపు సంస్థ అని వ్యాఖ్యానించారు. టీడీపీ రైతు వ్యతిరేకి కాబట్టే కార్పొరేట్ పాలన చేస్తోందన్నారు. రైతులు తిరగబడకముందే రుణాలు మాఫీ చేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.