కేసీఆర్.. హుందాగా వ్యవహరించు | Pretends to be sobering KCR .. says congress pcc chief raghuveera reddy | Sakshi
Sakshi News home page

కేసీఆర్.. హుందాగా వ్యవహరించు

Published Sun, May 25 2014 12:33 AM | Last Updated on Wed, Aug 29 2018 5:50 PM

కేసీఆర్.. హుందాగా వ్యవహరించు - Sakshi

కేసీఆర్.. హుందాగా వ్యవహరించు

ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి

అనంతపురం: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మాటలు తెలంగాణకు నష్టం కలిగిస్తాయని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. శనివారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. ‘కేసీఆర్ గతంలో ఒక పార్టీ అధ్యక్షుడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కాబోతున్న తొలి ముఖ్యమంత్రి. అలాంటప్పుడు ఆయన ఎంతో హుందాగా ఉండాల’ని హితవు పలికారు.

‘గతంలో ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారంటే అర్థముంది. ఇప్పుడు ఆ అవసరం ఏముంది?  ఇప్పుడూ రెచ్చగొట్టేలా మాట్లాడుతూ తప్పు చేస్తున్నారు. ఆయన మాటలు తెలంగాణకు నష్టం కలిగిస్తాయ’ని అన్నారు. తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని, అక్కడున్న ఏ ఒక్కరిపైనా ఈగ కూడా వాలకుండా రక్షణ కవచంగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement