
రఘువీరా ‘షో
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి చివరి ‘షో’కు తెరతీశారు
రఘువీరా ‘షో
ఒకే రోజు 386 పనులకు
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
కళ్యాణదుర్గం, : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి చివరి ‘షో’కు తెరతీశారు. శనివారం ఆయన తన నియోజకవర్గ కేంద్రమైన కళ్యాణదుర్గంలో 386 అభివృద్ధి పనులకు ఎంపీ అనంత వెంకటరామిరెడ్డితో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు గావించారు. మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణదుర్గం భవన్ (మంత్రి నివాసం) నుంచి బైక్‌ర్యాలీ ప్రారంభించారు. మార్గం మధ్యలో వాల్మీకి, గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. బళ్లారి బైపాస్‌రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రింగ్‌రోడ్డులో 14 కిలోమీటర్ల మేర బైక్‌లతో కలియదిరిగారు. అనంతరం స్థానిక మార్కెట్ యార్డులో నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఒకే చోట ఉంచి ఆవిష్కరించడం ద్వారా ‘ఘనత’ను చాటుకున్నారు. కార్యక్రమం అనంతరం కాంట్రాక్టర్లు, కమీషన్లు పొందిన కాంగ్రెస్ నాయకులు వారివారి గ్రామాలలో శిలఫలకాలను ఏర్పాటు చేయడానికి అవస్థలు పడుతూ తీసుకెళ్లడం కన్పించింది. రూ.190 కోట్ల ఖర్చుతో చేపట్టిన శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం పనులు పూర్తి కాకపోయినా, ప్రారంభోత్సవం చేయడం కొసమెరుపు.