
కేసీఆర్ పప్పులుడకవ్: రఘువీరా
వచ్చే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. సీమాంధ్రకు నీళ్లు వదలబోమని, సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవలసిందేనన్న కేసీఆర్ ప్రకటనలను ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యంలో చట్టం, నిబంధనలు ఉంటాయని, వాటి ప్రకారమే అన్నీ జరుగుతాయి తప్ప కేసీఆర్ చెప్పినట్లు కాదని చెప్పారు. కేసీఆర్ ఎన్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా ఆ పప్పులేమీ ఉడకవన్నారు. ఇందిరాభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ కేసీఆర్‌ది సీఎం కుర్చీలో కూర్చోవాలనే ఆరాటం తప్ప తెలంగాణను బాగుచేసుకోవాలన్న దృష్టి లేదు. కేసీఆర్ మాట తప్పిన విషయం అందరికీ తెలుసు. తెలంగాణలో ఉన్న సీమాంధ్రులే కాకుండా ఎవరికీ ఇబ్బందులు లేకుండా రక్షక కవచంగా ఉంటానని చెప్పి ఇప్పుడు ప్రజల్ని రెచ్చగొట్టడం విచారకరం.