
సొమ్మసిల్లిన రఘువీరా
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి వడదెబ్బ తగిలింది. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చిన ఆయన కొద్ది సేపటికి సొమ్మసిల్లిపడ్డిపోయారు. దాంతో కాంగ్రెస్ నాయకులు కంగారు పడ్డారు. వారు వెంటనే స్పందించి... వైద్యులను డీసీసీ కార్యాలయానికి తీసుకువచ్చారు. రఘువీరాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రఘువీరా రెడ్డికి వడదెబ్బ తగిలిందని వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనకు కొంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.