
'ఎమ్మెల్యేలే రూ.150 కోట్లు తినేశారు'
విశాఖపట్నం: హుద్ హుద్ తుపాను సాయంలో అధికార టీడీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. దీనిపై జనవరి మొదటివారంలో తమ పార్టీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ ద్వారా హైకోర్టులో పిటిషన్ వేశామని గుర్తు చేశారు.
తుపాను బాధితుల కోసం రూ. 300 కోట్లు ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు చెప్పారని, అయితే ఇందులో రూ. 150 కోట్లు టీడీపీ ఎమ్మెల్యేలే తినేశారని ఆరోపించారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో గవర్నర్ కలుస్తామని చెప్పారు. తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి లేఖ రాస్తానని రఘువీరారెడ్డి అన్నారు.