సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లును పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి గురువారం ఆ పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేశారు.
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లును పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి గురువారం ఆ పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేశారు. సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించి తొలి విడత జాబితాలో ఒంగోలు, బాపట్ల, నెల్లూరు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి.
ఒంగోలుకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దరిశి పవన్‌కుమార్, బాపట్లకు ప్రస్తుత కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, నెల్లూరుకు వాకాటి నారాయణరెడ్డి పేర్లు సిఫార్సు చేశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఒంగోలు, కొండపి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. బాపట్ల లోక్‌సభ పరిధిలో సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నెల్లూరు పార్లమెంటు పరిధిలో కందుకూరు నియోజకవర్గం మాత్రమే ఉంది.