Vakati Narayana Reddy
-
టీడీపీ ఎమ్మెల్సీ ఇంట్లో సీబీఐ సోదాలు
-
ఎమ్మెల్సీ వాకాటి అరెస్ట్‌తో కలకలం
నెల్లూరు(క్రైమ్): పూచీకత్తు ఆస్తులను అధికంగా చూపి బ్యాంకులను మోసగించిన కేసులో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని సీబీఐ అధికారులు ఆదివారం బెంగళూరులో అరెస్ట్ చేశారు. సీబీఐ చర్యలు జిల్లాలో తీవ్ర కలకలం రేకెత్తించాయి. వాకాటి నారాయణరెడ్డి 2014–15లో వివిధ బ్యాంకుల నుంచి రూ. 443.27 కోట్లు రుణం తీసుకున్నారు. అందుకు గాను తన సంస్థల పేరుపై ఉన్న భూములను తనఖాపెట్టారు. రుణం స కాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకులు ఆయన్ను డిఫాల్టర్‌గా ప్రకటించి ఆస్తుల స్వాధీ నానికి నోటీసులు జారీచేశాయి. ఈ క్రమలోనే ఆస్తుల విలువ అత్యధికంగా చూపి తమ వద్ద రూ.190కోట్లు రుణం తీసుకుని వాకాటి మోసంచేశారనీ, తప్పుడు డాక్యుమెంట్ల కారణంగా సంస్థకు రూ.205కోట్లు నష్టం వాటిల్లిందని ఐఎఫ్సీఐ సీబీఐకు ఫిర్యాదు చేయడంతో సీబీఐ వాకాటి నారాయణరెడ్డితోపాటు ఆయన సంస్థలకు చెంది న మరో ఆరుగురిపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఆయన్ను టీడీపీ అధినేత పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయినప్పటికీ ఆయన టీడీపీ సానుభూతి పరుడిగానే కొనసాగుతూ వచ్చారు. ఈ కేసులో విచారణ నిమిత్తం వాకాటి నారాయణరెడ్డి ఆదివారం బెంగళూరులో సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. కొద్దిసేపటికి ఆయన్ను సీబీఐ అధికారులు అరెస్ట్‌చేశారు. అయితే అధికారికంగా ప్రకటించలేదు. దీంతో రాత్రి వరకు తీవ్ర ఉత్కంఠత నెలకొంది. వాకాటి అరెస్ట్ విషయం చివరకు బయటకు పొక్కడంతో జిల్లాలో వాకాటి సొంత గ్రామమైన తడ మండలం చేనిగుంటలో తీవ్ర కలకలం రేగింది. గతేడాది ఆయనను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్ చేసినప్పటికీ మూడునెలలుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొం టూనే ఉన్నారు. ఇటీవల జరిగిన జన్మభూమి కార్యక్రమం, జెడ్పీ సమావేశాల్లో క్రియాశీలక భూమిక పోషించారు. రేపో, మో పో పార్టీలో మళ్లీ చేరే అవకాశం ఉందని అందుకు చంద్రబాబు సైతం పచ్చజెండా ఊపారని ఆయన వర్గీయులు, కొందరు టీడీపీ నాయకులు కొద్ది రోజులుగా ప్రకటిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో వాకాటి అరెస్ట్ కావడం ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన రెకెత్తిస్తోంది. -
టీడీపీ ఎమ్మెల్సీ వాకాటిని అరెస్ట్ చేసిన సీబీఐ
-
టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి అరెస్ట్
నెల్లూరు, సాక్షి ప్రతినిధి/బెంగళూరు: అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని ఆదివారం సాయంత్రం బెంగళూరులో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. బ్యాంకులను మోసం చేసి భారీగా రుణాలు పొందిన వ్యవహారంలో కొన్నేళ్లుగా వాకాటి ఆరోపణలు ఎదుర్కొ న్నారు. ఆరోపణలు నిజమేనని నిర్ధారణ కావడంతో ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించి, సాయంత్రం అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన వాకాటి వీఎన్ఆర్ ఇన్ఫ్రా, వీఎన్ఆర్ రైల్, లాజిస్టిక్స్ తదితర కంపెనీలను నిర్వహిస్తున్నారు. ఆయనకు హైదరాబాద్ షామీర్‌పేటలో రూ.12 కోట్లు విలువచేసే భవనం ఉంది. దీనిని నకిలీ డాక్యుమెంట్ల ద్వారా విలువను భారీగా పెంచేసి, రూ.250 కోట్ల రుణం కోరుతూ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నారు. ఫైనాన్స్ కార్పొరేషన్ 2014లో రూ.190 కోట్ల రుణం మంజూరు చేసింది. అసలు, వడ్డీ చెల్లించడంలో వాకాటి నారాయణరెడ్డి విఫలం కావడంతో ఫైనాన్స్ కార్పొరేషన్ బకాయి రూ.205.02 కోట్లకు చేరింది. దీంతో ఫైనాన్స్ కార్పొరేషన్ వాకాటి ఆస్తుల జప్తుపై దృష్టి సారించింది. రుణం కోసం ఆయన సమర్పించిన డాక్యుమెంట్లు నకిలీవని విచారణలో తేలింది. దీంతో గతేడాది మే 5న ఫైనాన్స్ కార్పొరేషన్ ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. మే 12న నెల్లూరు, హైదరాబాద్, బెంగళూరులోని ఆయన కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించింది. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి విచారణ ప్రక్రియ కొనసాగించి ఆదివారం అరెస్ట్ చేసింది. ఐపీ పెట్టిన రెండు కంపెనీలు: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వీఎన్ఆర్ ఇన్ఫ్రా, వీఎన్ఆర్ రైల్ కంపెనీలు గతేడాది ఐపీ పిటిషన్ దాఖలు చేశాయి. బ్యాంకుల్లో రుణాలు వడ్డీలతో కలిపి రూ.వందల కోట్లు దాటడంతో రెండు కంపెనీలు ఐపీ(దివాలా) దాఖలు చేశాయి. మరోవైపు నెల్లూరు, బెంగళూరు, హైదరాబాద్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి వాకాటి రూ.443 కోట్ల రుణాలు పొందారు. వాటిని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు ఆస్తుల అటాచ్మెంట్, జప్తు ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి అరెస్ట్‌తో నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. -
బ్యాంకులకు 529 కోట్లు ఎగ్గొట్టిన వాకాటి
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీగా (ప్రస్తుతం సస్పెండ్ చేశారు) ఎన్నికైన వాకాటి నారాయణ రెడ్డికి చెందిన వీఎన్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ బ్యాంకులకు రూ. 529.34 కోట్లు బకాయి పడింది. దీంతో మీ ఆస్తులను రుణం కింద ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో తెలపాలంటూ డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) పత్రికా ప్రకటన ద్వారా బహిరంగ షోకాజు నోటీసు జారీ చేసింది. ఆస్తులు స్వాధీనం చేసుకొని బ్యాంకులకు అనుకూలంగా ఎందుకు తీర్పు ఇవ్వకూడదో 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆ ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా మొత్తం ఆస్తుల చిట్టాతో డిసెంబర్ 8న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని డీఆర్టీ ఆఫీసుకు రావాల్సిందిగా ఆదేశించింది. -
జేసీ బ్రదర్స్ అండతోనే..
అనంతపురం: జేసీ బ్రదర్స్ అండతోనే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని తాడిపత్రి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. సీబీఐ దాడులు అనంతరం ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని టీడీపీ నుంచి సీఎం చంద్రబాబు సస్పెండ్ చేశారని.. దీపక్‌రెడ్డి అరెస్టైనా చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. వాకాటికో న్యాయం, దీపక్‌రెడ్డికి మరో న్యాయమా అని అడిగారు. పెద్దారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ... దీపక్‌రెడ్డిపై తెలంగాణ ప్రభుత్వం ‘సిట్’తో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నడిబొడ్డుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వందల కోట్ల విలువైన స్థలాలను కబ్జా చేయడానికి కుట్ర పన్నారన్న ఆరోపణలతో దీపక్‌రెడ్డిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. వాకాటి నారాయణరెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలు జరిపిన మరుసటి రోజే ఆయనను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. దీపక్‌రెడ్డిపై ఎటువంటి చర్య తీసుకోకపోవడం చంద్రబాబు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విపక్షాలు పేర్కొంటున్నాయి. -
సస్పెన్షన్‌పై నేనేమీ మాట్లాడను
-
‘చంద్రబాబు మాటలకు జనం నవ్వుకుంటున్నారు’
-
ఎమ్మెల్సీగా వాకాటి నారాయణరెడ్డి ప్రమాణం
అమరావతి: టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వాకాటి నారాయణరెడ్డి సోమవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ చక్రపాణి ఇవాళ ఉదయం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. వాకాటిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టీడీపీ నేతలు దూరంగా ఉండటంతో ...ఆయన ఒంటరిగానే వచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం వాకాటి మాట్లాడుతూ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని అన్నారు. మళ్లీ టీడీపీ, చంద్రబాబుతో కలిసి పని చేస్తానని, ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు, లోకేశ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకు రుణాల చెల్లింపులో జాప్యం జరిగిన మాట వాస్తవమే అని వాకాటి అంగీకరించారు. రుణాలను రీ స్ట్రక్చర్ చేసే అంశంపై ఆలోచిస్తున్నామని రెండు, మూడు నెలల్లో అంతా సర్ధుకుంటుందని ఆయన అన్నారు. కాగా ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా డబ్బులు ఖర్చుపెట్టి గెలిచిన వాకాటి నారాయణరెడ్డి ఇంటి మీద శుక్రవారం నాడు సీబీఐ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. వివిధ బ్యాంకులకు రూ. 450 కోట్ల మేర బకాయిలు ఉన్న వాకాటి నారాయణరెడ్డి విల్‌ఫుల్ డీఫాల్టర్‌గా ఉన్నారా అనే విషయం గురించి దర్యాప్తు చేసేందుకే సీబీఐ ఈ సోదాలు చేసింది. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే టీడీపీ ఎమ్మెల్సీగా శత్రుచర్ల విజయరామరాజు కూడా ప్రమణాస్వీకారం చేశారు. -
‘చంద్రబాబు మాటలకు జనం నవ్వుకుంటున్నారు’
తిరుమల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో థ్వజమెత్తారు. సోమవారం ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతం రోజా మాట్లాడుతూ...’ స్నానం చేయకుండా 24 గంటలపాటు రాష్ట్ర ప్రజల కోసమే విదేశీ పర్యటనలు చేస్తున్నానని చంద్రబాబు అన్న మాటలకు జనం నవ్వుకుంటున్నారు. బాబు ఎందుకు విదేశీ పర్యటనలు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు. దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి, విరాళాల కోసమే పర్యనటలు చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. అమెరికాలో 300 కంపెనీల సీఈవోలను కలుస్తానని వెళ్లారు. అయితే చంద్రబాబు అవినీతి తెలుసుకుని 200మంది సీఈవోలు కలవడానికి భయపడ్డారు. చంద్రబాబు అవినీతిలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపారు. వైఎస్ జగన్ మగాడిలా మీడియా సమక్షంలో ప్రధాని మోదీని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ గురించి, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన అనంతరం చంద్రబాబు ఢిల్లీలో 6 గంటలు ఎక్కడి వెళ్లారో చెప్పాలి. అమిత్ షా కాళ్లు పట్టుకోవడానికా, హోంమంత్రి కాళ్లు పట్టుకోవడానికి వెళ్లారా? రెండున్నరేళ్లలో చంద్రబాబు అండ్ కో రూ.2 లక్షల కోట్లు దోచుకుంది. ప్రజలను డైవర్ట్ చేయడానికే ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి సస్పెన్షన్ డ్రామా. సుజనా చౌదరి మారిషస్ బ్యాంకు వందల కోట్లు ఎగ్గొట్టారు. అలాంటివారికి కేంద్రమంత్రి పదవి ఇచ్చారు. ఇక ఓటుకు కోట్లు కేసులో దోషిగా ఉన్న చంద్రబాబు అవినీతికి పాల్పడిన సుజనా చౌదరి, గంటా శ్రీనివాసరావు ముందు రాజీనామా చేయాలి. లోకేశ్‌కు 5 నెలల్లో 22 రెట్లు ఆస్తులు ఎలా పెరిగాయి?. వాకాటి నారాయణరెడ్డిపై సీబీఐ సోదాలను స్వాగతిస్తున్నాం. కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదనడం అవివేకం. చంద్రబాబు శ్రీవారి దర్శనానికి వచ్చి అనేక హామీలు ఇచ్చారు. చిత్తశుద్ధి ఎంటే ఆలయాల చుట్టూ ఉన్న బెల్ట్ షాపులు ఎత్తేయండి. ఐఏఎస్ అధికారులు ఏ ప్రాంతంవారైనా పర్వాలేదు. అయితే టీటీడీ అభివృద్ధికి దోహదపడేలా ఉండాలి.’ అని అన్నారు. -
‘చంద్రబాబు చుట్టూ విజయ్ మాల్యాలు’
-
‘చంద్రబాబు చుట్టూ విజయ్ మాల్యాలు’
నెల్లూరు: ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయడం సరైందేనని నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. వాకాటిపై ముందు నుంచే కేసులు ఉన్నా టికెట్ ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజల దృష్టిని మరల్చేందుకే వాకాటిని టీడీపీ సస్పెండ్ చేసిందని ఆరోపించారు. గంటా శ్రీనివాసరావు, సీఎం రమేశ్, రాయపాటి సాంబశిరావులపై కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సుజనా చౌదరి వేల కోట్ల రూపాయలు ఎగ్గొడితే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. వాకాటిపై ఆరోపణల గురించి ముందే చెప్పామని, అయినా టికెట్ ఇచ్చి కోట్లు ఖర్చు చేశారని దుయ్యబట్టారు. అక్రమ కేసులతో ప్రజాప్రతినిధులను భయపెట్టిన ఘనత చంద్రబాబుదని చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు చేయించుకుని క్లీన్చిట్ తెచ్చుకునే ధైర్యం ఉందా అని నిలదీశారు. చంద్రబాబు చుట్టూ వందల మంది విజయ్ మాల్యాలు ఉన్నారని విమర్శించారు. టీడీపీలో ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని సస్పెండ్ చేయాలని కాకాని డిమాండ్ చేశారు. -
చంద్రబాబు ద్వంద నీతి
-
టీడీపీ నుంచి వాకాటి సస్పెన్షన్
-
టీడీపీ నుంచి వాకాటి సస్పెన్షన్
ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా డబ్బులు ఖర్చుపెట్టి గెలిచిన నారాయణరెడ్డి ఇంటి మీద శుక్రవారం నాడు సీబీఐ అధికారులు దాడులు జరపడంతో.. ఆయనతో తమకు సంబంధం లేదని చెప్పుకోడానికి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వివిధ బ్యాంకులకు రూ. 450 కోట్ల మేర బకాయిలు ఉన్న వాకాటి నారాయణరెడ్డి విల్‌ఫుల్ డీఫాల్టర్‌గా ఉన్నారా అనే విషయం గురించి దర్యాప్తు చేసేందుకే సీబీఐ ఈ సోదాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీబీఐ సోదాలు చేయడం, బ్యాంకులకు భారీగా బకాయిలు ఉన్న విషయం మరోసారి బయటకు రావడంతో... ఆ గుట్టు రట్టు కావడంతో చంద్రబాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. విదేశీ పర్యటన నుంచి చంద్రబాబు రాగానే ఈ నిర్ణయం వచ్చింది. ఇంతకుముందు కూడా చాలామంది టీడీపీ నేతలపై ఈ తరహా ఆరోపణలు వచ్చినా వారెవ్వరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోని చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం తొలిసారిగా సస్పెన్షన్ వేటు వేయడం విశేషం. పార్టీలో ఎవరు తప్పుచేసినా కరెక్ట్ కాదని, అందుకే ఆయనను సస్పెండ్ చేస్తున్నామని బాబు ప్రకటించారు. -
టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి ఇంట్లో సీబీఐ సోదాలు
-
టీడీపీ ఎమ్మెల్సీ ఇళ్లలో సీబీఐ సోదాలు
-
టీడీపీ ఎమ్మెల్సీ ఇళ్లలో సీబీఐ సోదాలు
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, నెల్లూరులలో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. ఇటీవలే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గత ఏడాది వాకాటి నారాయణరెడ్డిపై చీటింగ్ కేసు సహా మరికొన్ని కేసులు నమోదయ్యాయి. వీఎన్ఆర్ ఇన్ఫ్రా తదితర కంపెనీల పేరుతో ఆయన సుమారు రూ. 450 కోట్ల వరకు రుణాలు తీసుకుని, డీఫాల్టర్‌గా మారడంతో బ్యాంకులు నోటీసులు పంపాయి. అవి తిరిగి రావడంతో మారిన చిరునామాకు కూడా నోటీసులు పంపాయి. ఆస్తులు వేలం వేయనున్నట్లు పత్రికల్లో భారీగా ప్రకటనలు ఇచ్చాయి. తాజాగా బ్యాంకులు ఫిర్యాదు చేయడంతోనే సీబీఐ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ఆదాయపన్ను శాఖ అధికారులు మే 3వ తేదీన వాకాటి ఇళ్లపై దాడులు చేసి, ఆయన విల్‌ఫుల్ డీఫాల్టర్‌గా ఉన్నారా లేక మరేమైనా ఉందా అనే విషయాన్ని దర్యాప్తు చేశారు. అప్పట్లో నెల్లూరు, తడ, సూళ్లూరుపేటలలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. తాజాగా శుక్రవారం తెల్లవారుజామునే నెల్లూరు చేరుకుని వేదాయపాళెంలో ఉన్న ఇంట్లో సోదాలు చేసి, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి నెల్లూరులో ఉన్నది కేవలం అతిథిగృహం మాత్రమే. అందులో పది బెడ్రూంలు ఉన్నాయి. సీబీఐ అధికారులు అన్ని గదుల్లోకీ వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే అక్కడ ఏం గమనించామన్న విషయాన్ని మాత్రం వాళ్లు వెల్లడించడం లేదు. వాకాటి స్వగ్రామానికి కూడా సీబీఐ మరో బృందం చేరుకున్నట్లు తెలిసింది. స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐఓబీ తదితర బ్యాంకులకు వాకాటి భారీగా బకాయిలు ఉన్నట్లు సమాచారం. -
వాకాటి రూ.443.27 కోట్లు బురిడీ
-
వాకాటి రూ.443.27 కోట్లు బురిడీ
⇒ అయినప్పటికీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ ⇒ ఉన్నత స్థాయి పెద్దల ఒత్తిడితో ఆమోదించిన ఎన్నికల అధికారి సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి ఇదో పరాకాష్ట. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాకాటి నారాయణ రెడ్డి నాలుగు బ్యాంకులకు రూ.443.27 కోట్ల రుణం చెల్లించలేదు. బ్యాంకులకు అప్పులు చెల్లించని వారు, ప్రభుత్వానికి పన్నులు కట్టనివారు (డిఫాల్టర్లు) ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. వాకాటి నారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేసినపుడు ఎన్నికల సంఘానికి సమర్పిం చిన అఫిడవిట్లో నాలుగు బ్యాంకులకు రుణం చెల్లించని అంశాన్ని ప్రస్తావించలేదు. నిబంధనల మేరకు ఇతని నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించాలి. కానీ ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గి అతని నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించలేదని తెలుస్తోంది. వాకాటి హామీదారుగా ఉండి వీఎన్ఆర్ ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్, పవర్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్, లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్), బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోసీ)ల నుంచి రుణం ఇప్పించారు. రుణం తీసుకున్న ఈ సంస్థలు సకాలంలో తిరిగి చెల్లించలేదు. రూ.443.27 కోట్లు బకాయి పడినట్లు ఎస్బీఐ, ఎస్బీహెచ్, బీవోబీ, ఐవోసీలు తేల్చాయి. -
టీడీపీలోకి ఒంటరిగానే వాకాటి
అనుసరించని అనుచరులు కాంగ్రెస్‌లోనే ఇసనాక వ్యూహంలో భాగమేనని ప్రచారం సూళ్లూరుపేట: రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సూళ్లూరుపేట నియోజకవర్గంలో వె న్నుదన్నుగా నిలిచిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఆది వారం టీడీపీలో చేరిపోయారు. వాకాటి ముఖ్య అనుచరుడైన చెంగాళమ్మ ఆలయపాలక మండలి చైర్మన్ ఇసనాక హర్షవర్థన్‌రెడ్డి, ఆయన శిష్యగణం అందరూ కలిసి పార్టీ మారతారని రెండు నెలలుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఒక్కరే టీడీపీలో చేరడం చర్చనీయాం శంగా మారింది. ఇదంతా గురుశిష్యుల వ్యూహంలో భాగమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సూళ్లూరుపేట ని యోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా వాకాటి, రాజకీయంగా ఇసనాక అండగా ఉంటూ వచ్చారు. 2004 నుంచి 2014 వరకు నియోజకవర్గంలో ఈ ఇద్దరే చక్రం తి ప్పారు. అయితే రాజకీయంగా అపర చాణక్యుడిగా పేరుగాంచిన ఇసనాక హర్షవర్ధన్‌రెడ్డికి వాకాటితో అంతర్గతం గా విబేధాలు నెలకొన్నాయనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఇసనాక పార్టీని వీడితే ఇక్కడ మాజీ ఎంపీ చింతామోహన్ ముఖ్య అనుచరుడు దూర్తాటి మధుసూదన్కీలకమవుతాడనే ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్‌లో కొనసాగాలనే వ్యూహం రచించినట్లు చర్చ సాగుతోంది. కొద్ది రో జుల తర్వాత ఇసనాక కూడా టీడీపీలో చేరిపోతారని కొం దరు అంటున్నారు. ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాను కాంగ్రెస్‌ను వీడనని చెబుతున్నారు. వీరి రాజకీ యం ఇలా ఉంటే వాకాటి చేరికతో టీడీపీలో మరో వర్గం ఏర్పడినట్టయింది. పార్టీ ఆవిర్భావం నుంచి వేనాటి కు టుంబం కీలకపాత్ర పోషిస్తోంది. దివగంత వేనాటి ము నిరెడ్డి అప్పట్లో కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టించారు. ఆయన మరణానంతరం సోదరుడు వేనాటి రామచంద్రారెడ్డి ఆ స్థాయిలో రాజకీయాలు చేయలేక, వర్గాన్ని కాపాడుకునే విషయంలో వెనుకబడిపోయాడు. ప్రముఖ కాం ట్రాక్టర్ కొండేపాటి గంగాప్రసాద్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా గత రెండు సార్వత్రిక ఎన్నికలుగా టీడీపీలో తెరవెనుక కీలకపాత్ర పోషిస్తున్నాడు. వేనాటి వర్గాన్ని త న వైపు తిప్పుకుని పట్టుసాధించాడు. ఆయన ధాటికి త ట్టుకోలేక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భం గా కొండేపాటి వేనాటి చేతులు కలపాల్సి వచ్చింది. ప్ర స్తుతం ఆర్థికంగా, రాజకీయంగా బలమైన వాకాటి చేరిక తో వేనాటి వర్గానికి చెక్ పడుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద సూళ్లూరుపేట టీడీపీలో మరో వర్గం ఏర్పడుతోందని ప్రచారం సాగుతోంది. -
కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లును పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి గురువారం ఆ పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేశారు. సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించి తొలి విడత జాబితాలో ఒంగోలు, బాపట్ల, నెల్లూరు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఒంగోలుకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దరిశి పవన్‌కుమార్, బాపట్లకు ప్రస్తుత కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, నెల్లూరుకు వాకాటి నారాయణరెడ్డి పేర్లు సిఫార్సు చేశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఒంగోలు, కొండపి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. బాపట్ల లోక్‌సభ పరిధిలో సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నెల్లూరు పార్లమెంటు పరిధిలో కందుకూరు నియోజకవర్గం మాత్రమే ఉంది. -
ఎమ్మెల్సీ వాకాటి ఇళ్లపై ఐటీ దాడులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శాసనమండలి సభ్యుడు వాకాటి నారాయణరెడ్డి, ఆయన అనుచరుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. నెల్లూరు, సూళ్లూరుపేట, తడ మండలం చేనిగుంటల్లో అధికారులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. నెల్లూరులోని దర్గామిట్ట, చేనిగుంటలో ఎమ్మెల్సీ సొంత ఇళ్లతో పాటు సూళ్లూరుపేటలోని ఆయన అనుచరులు కళత్తూరు కిరణ్‌కుమార్‌రెడ్డి, దేవారెడ్డి సుధాకర్‌రెడ్డి ఇళ్లలోనూ సోదాలు చేశారు. జిల్లా కాంగ్రెస్‌లో ఆనం సోదరుల తర్వాత స్థానాన్ని ఆక్రమించిన వాకాటి నారాయణరెడ్డి నివాసాలపై ఏకకాలంలో జరిగిన ఐటీ దాడులు కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోతుండగా ఇటీవలి పరిణామాలతో సీమాంధ్రలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో అంతోఇంతో పలుకుబడి కలిగిన నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు ఈ తరహా ఎత్తుగడలు అమలు చేసి ఉంటుందనే అనుమానాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. స్వల్ప వ్యవధిలోనే దేశవ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకుని వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తున్న వాకాటిపై ఐటీ గురిపెట్టడం వెనక అధికార పార్టీలో రాజకీయ ప్రయోజనాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.