- అనుసరించని అనుచరులు
- కాంగ్రెస్‌లోనే ఇసనాక
- వ్యూహంలో భాగమేనని ప్రచారం
సూళ్లూరుపేట: రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సూళ్లూరుపేట నియోజకవర్గంలో వె న్నుదన్నుగా నిలిచిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఆది వారం టీడీపీలో చేరిపోయారు. వాకాటి ముఖ్య అనుచరుడైన చెంగాళమ్మ ఆలయపాలక మండలి చైర్మన్ ఇసనాక హర్షవర్థన్‌రెడ్డి, ఆయన శిష్యగణం అందరూ కలిసి పార్టీ మారతారని రెండు నెలలుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఒక్కరే టీడీపీలో చేరడం చర్చనీయాం శంగా మారింది.
ఇదంతా గురుశిష్యుల వ్యూహంలో భాగమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సూళ్లూరుపేట ని యోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా వాకాటి, రాజకీయంగా ఇసనాక అండగా ఉంటూ వచ్చారు. 2004 నుంచి 2014 వరకు నియోజకవర్గంలో ఈ ఇద్దరే చక్రం తి ప్పారు. అయితే రాజకీయంగా అపర చాణక్యుడిగా పేరుగాంచిన ఇసనాక హర్షవర్ధన్‌రెడ్డికి వాకాటితో అంతర్గతం గా విబేధాలు నెలకొన్నాయనే వాదన వినిపిస్తోంది.
మరోవైపు ఇసనాక పార్టీని వీడితే ఇక్కడ మాజీ ఎంపీ చింతామోహన్ ముఖ్య అనుచరుడు దూర్తాటి మధుసూదన్‌కీలకమవుతాడనే ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్‌లో కొనసాగాలనే వ్యూహం రచించినట్లు చర్చ సాగుతోంది. కొద్ది రో జుల తర్వాత ఇసనాక కూడా టీడీపీలో చేరిపోతారని కొం దరు అంటున్నారు. ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాను కాంగ్రెస్‌ను వీడనని చెబుతున్నారు. వీరి రాజకీ యం ఇలా ఉంటే వాకాటి చేరికతో టీడీపీలో మరో వర్గం ఏర్పడినట్టయింది.
పార్టీ ఆవిర్భావం నుంచి వేనాటి కు టుంబం కీలకపాత్ర పోషిస్తోంది. దివగంత వేనాటి ము నిరెడ్డి అప్పట్లో కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టించారు. ఆయన మరణానంతరం సోదరుడు వేనాటి రామచంద్రారెడ్డి ఆ స్థాయిలో రాజకీయాలు చేయలేక, వర్గాన్ని కాపాడుకునే విషయంలో వెనుకబడిపోయాడు. ప్రముఖ కాం ట్రాక్టర్ కొండేపాటి గంగాప్రసాద్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా గత రెండు సార్వత్రిక ఎన్నికలుగా టీడీపీలో తెరవెనుక కీలకపాత్ర పోషిస్తున్నాడు.
వేనాటి వర్గాన్ని త న వైపు తిప్పుకుని పట్టుసాధించాడు. ఆయన ధాటికి త ట్టుకోలేక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భం గా కొండేపాటి వేనాటి చేతులు కలపాల్సి వచ్చింది. ప్ర స్తుతం ఆర్థికంగా, రాజకీయంగా బలమైన వాకాటి చేరిక తో వేనాటి వర్గానికి చెక్ పడుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద సూళ్లూరుపేట టీడీపీలో మరో వర్గం ఏర్పడుతోందని ప్రచారం సాగుతోంది.