ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా డబ్బులు ఖర్చుపెట్టి గెలిచిన నారాయణరెడ్డి ఇంటి మీద శుక్రవారం నాడు సీబీఐ అధికారులు దాడులు జరపడంతో.. ఆయనతో తమకు సంబంధం లేదని చెప్పుకోడానికి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.