తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, నెల్లూరులలో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. ఇటీవలే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గత ఏడాది వాకాటి నారాయణరెడ్డిపై చీటింగ్ కేసు సహా మరికొన్ని కేసులు నమోదయ్యాయి. వీఎన్ఆర్ ఇన్‌ఫ్రా తదితర కంపెనీల పేరుతో ఆయన సుమారు రూ. 450 కోట్ల వరకు రుణాలు తీసుకుని, డీఫాల్టర్‌గా మారడంతో బ్యాంకులు నోటీసులు పంపాయి. అవి తిరిగి రావడంతో మారిన చిరునామాకు కూడా నోటీసులు పంపాయి. ఆస్తులు వేలం వేయనున్నట్లు పత్రికల్లో భారీగా ప్రకటనలు ఇచ్చాయి. తాజాగా బ్యాంకులు ఫిర్యాదు చేయడంతోనే సీబీఐ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ఆదాయపన్ను శాఖ అధికారులు మే 3వ తేదీన వాకాటి ఇళ్లపై దాడులు చేసి, ఆయన విల్‌ఫుల్ డీఫాల్టర్‌గా ఉన్నారా లేక మరేమైనా ఉందా అనే విషయాన్ని దర్యాప్తు చేశారు. అప్పట్లో నెల్లూరు, తడ, సూళ్లూరుపేటలలో ఐటీ అధికారులు సోదాలు చేశారు.
Published Fri, May 12 2017 3:33 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
Advertisement