‘చంద్రబాబు మాటలకు జనం నవ్వుకుంటున్నారు’ | People are laughing at cm chandrababu comments, says ysrcp mla roja | Sakshi
Sakshi News home page

‘జగన్‌ మగాడిలా మీడియా సమక్షంలో ప్రధానిని కలిశారు’

Published Mon, May 15 2017 8:55 AM | Last Updated on Tue, May 29 2018 3:49 PM

‘చంద్రబాబు మాటలకు జనం నవ్వుకుంటున్నారు’ - Sakshi

‘చంద్రబాబు మాటలకు జనం నవ్వుకుంటున్నారు’

తిరుమల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో థ్వజమెత్తారు. సోమవారం ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతం రోజా మాట్లాడుతూ...’ స్నానం చేయకుండా 24 గంటలపాటు రాష్ట్ర ప్రజల కోసమే విదేశీ పర్యటనలు చేస్తున్నానని చంద్రబాబు అన్న మాటలకు జనం నవ్వుకుంటున్నారు. బాబు ఎందుకు విదేశీ పర్యటనలు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు.

దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి, విరాళాల కోసమే పర్యనటలు చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. అమెరికాలో 300 కంపెనీల సీఈవోలను కలుస్తానని వెళ్లారు. అయితే చంద్రబాబు అవినీతి తెలుసుకుని 200మంది సీఈవోలు కలవడానికి భయపడ్డారు. చంద్రబాబు అవినీతిలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపారు. వైఎస్‌ జగన్‌ మగాడిలా మీడియా సమక్షంలో  ప్రధాని మోదీని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ గురించి, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించారు.

విదేశీ పర్యటన నుంచి వచ్చిన అనంతరం చంద్రబాబు ఢిల్లీలో 6 గంటలు ఎక్కడి వెళ్లారో చెప్పాలి. అమిత్‌ షా కాళ్లు పట్టుకోవడానికా, హోంమంత్రి కాళ్లు పట్టుకోవడానికి వెళ్లారా? రెండున్నరేళ్లలో చంద్రబాబు అండ్‌ కో రూ.2 లక్షల కోట్లు దోచుకుంది. ప్రజలను డైవర్ట్‌ చేయడానికే ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి సస్పెన్షన్‌ డ్రామా. సుజనా చౌదరి మారిషస్‌ బ్యాంకు వందల కోట్లు ఎగ్గొట్టారు. అలాంటివారికి కేంద్రమంత్రి పదవి ఇచ్చారు.

ఇక ఓటుకు కోట్లు కేసులో దోషిగా ఉన్న చంద్రబాబు అవినీతికి పాల్పడిన సుజనా చౌదరి, గంటా శ్రీనివాసరావు ముందు రాజీనామా చేయాలి. లోకేశ్‌కు 5 నెలల్లో 22 రెట్లు ఆస్తులు ఎలా పెరిగాయి?. వాకాటి నారాయణరెడ్డిపై సీబీఐ సోదాలను స్వాగతిస్తున్నాం. కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదనడం అవివేకం.  చంద్రబాబు శ్రీవారి దర్శనానికి వచ్చి అనేక హామీలు ఇచ్చారు. చిత్తశుద్ధి ఎంటే ఆలయాల చుట్టూ ఉన్న బెల్ట్‌ షాపులు ఎత్తేయండి. ఐఏఎస్‌ అధికారులు ఏ ప్రాంతంవారైనా పర్వాలేదు. అయితే టీటీడీ అభివృద్ధికి దోహదపడేలా ఉండాలి.’ అని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement