సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీగా (ప్రస్తుతం సస్పెండ్ చేశారు) ఎన్నికైన వాకాటి నారాయణ రెడ్డికి చెందిన వీఎన్‌ఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ బ్యాంకులకు రూ. 529.34 కోట్లు బకాయి పడింది. దీంతో మీ ఆస్తులను రుణం కింద ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో తెలపాలంటూ డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ) పత్రికా ప్రకటన ద్వారా బహిరంగ షోకాజు నోటీసు జారీ చేసింది. ఆస్తులు స్వాధీనం చేసుకొని బ్యాంకులకు అనుకూలంగా ఎందుకు తీర్పు ఇవ్వకూడదో 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆ ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా మొత్తం ఆస్తుల చిట్టాతో డిసెంబర్ 8న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని డీఆర్‌టీ ఆఫీసుకు రావాల్సిందిగా ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment