
నెల్లూరు(క్రైమ్): పూచీకత్తు ఆస్తులను అధికంగా చూపి బ్యాంకులను మోసగించిన కేసులో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని సీబీఐ అధికారులు ఆదివారం బెంగళూరులో అరెస్ట్ చేశారు. సీబీఐ చర్యలు జిల్లాలో తీవ్ర కలకలం రేకెత్తించాయి. వాకాటి నారాయణరెడ్డి 2014–15లో వివిధ బ్యాంకుల నుంచి రూ. 443.27 కోట్లు రుణం తీసుకున్నారు. అందుకు గాను తన సంస్థల పేరుపై ఉన్న భూములను తనఖాపెట్టారు. రుణం స కాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకులు ఆయన్ను డిఫాల్టర్‌గా ప్రకటించి ఆస్తుల స్వాధీ నానికి నోటీసులు జారీచేశాయి. ఈ క్రమలోనే ఆస్తుల విలువ అత్యధికంగా చూపి తమ వద్ద రూ.190కోట్లు రుణం తీసుకుని వాకాటి మోసంచేశారనీ, తప్పుడు డాక్యుమెంట్ల కారణంగా సంస్థకు రూ.205కోట్లు నష్టం వాటిల్లిందని ఐఎఫ్‌సీఐ సీబీఐకు ఫిర్యాదు చేయడంతో సీబీఐ వాకాటి నారాయణరెడ్డితోపాటు ఆయన సంస్థలకు చెంది న మరో ఆరుగురిపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఆయన్ను టీడీపీ అధినేత పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
అయినప్పటికీ ఆయన టీడీపీ సానుభూతి పరుడిగానే కొనసాగుతూ వచ్చారు. ఈ కేసులో విచారణ నిమిత్తం వాకాటి నారాయణరెడ్డి ఆదివారం బెంగళూరులో సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. కొద్దిసేపటికి ఆయన్ను సీబీఐ అధికారులు అరెస్ట్‌చేశారు. అయితే అధికారికంగా ప్రకటించలేదు. దీంతో రాత్రి వరకు తీవ్ర ఉత్కంఠత నెలకొంది. వాకాటి అరెస్ట్ విషయం చివరకు బయటకు పొక్కడంతో జిల్లాలో వాకాటి సొంత గ్రామమైన తడ మండలం చేనిగుంటలో తీవ్ర కలకలం రేగింది. గతేడాది ఆయనను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్ చేసినప్పటికీ మూడునెలలుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొం టూనే ఉన్నారు. ఇటీవల జరిగిన జన్మభూమి కార్యక్రమం, జెడ్పీ సమావేశాల్లో క్రియాశీలక భూమిక పోషించారు. రేపో, మో పో పార్టీలో మళ్లీ చేరే అవకాశం ఉందని అందుకు చంద్రబాబు సైతం పచ్చజెండా ఊపారని ఆయన వర్గీయులు, కొందరు టీడీపీ నాయకులు కొద్ది రోజులుగా ప్రకటిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో వాకాటి అరెస్ట్ కావడం ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన రెకెత్తిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment